సరదాగా వాకింగ్ చేసి..20 గంటల్లో..లక్ష మెట్లు ఎక్కి దిగేసి రికార్డ్ సాధించేశాడు

  • Published By: nagamani ,Published On : November 23, 2020 / 02:23 PM IST
సరదాగా వాకింగ్ చేసి..20 గంటల్లో..లక్ష మెట్లు ఎక్కి దిగేసి రికార్డ్ సాధించేశాడు

Maharashtra : Thane Man one lakh steps ‘India Book of Records : ఏంటో నవ్వేద్దామనిపించింది ఫ్రెండ్స్ నవ్వేసా..అంటూ వచ్చిన ఓ చిన్న వీడియో ఇటీవల వైరల్ గా మారింది. అలాగే ఓ యువకుడు సరదాగా చేసిన పని రికార్డు అయి కూర్చుంది. ఏకంగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ సాధించేశాడు మహారాష్ట్రలోని థానేకు చెందిన బాలాజీ సూర్యవంశీ అనే 28ఏళ్ల కుర్రాడు. సూర్యవంశీ 20 గంటల్లో లక్షకు పైగా మెట్లు ఎక్కి దిగుతూ…రికార్డు సృష్టించాడు.



వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని థానేకు చెందిన బాలాజీ సూర్యవంశీ రెగ్యులేటరీ ఎఫైర్స్‌ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నాడు. వయసు 28 ఏళ్లు. కానీ భారీ ఊబకాయంతో నడవటానికి ఆయాసపడిపోయేవాడు.బరువు తగ్గటానికి వాకింగ్ చేద్దామనుకున్నాడు. 2020 జనవరిలో స్టార్ట్ చేశాడు. వాకింగ్ అంటే ఏ పార్కుకో లేదా రోడ్డు మీదకో వెళ్లి కాదు..ఇంట్లోనే స్టార్ట్ చేశాడు. సూర్యవంశీ ఇంట్లో ఉండే మెట్లు ఎక్కి దిగుతూ ఉండేవాడు. అలా రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడు. దాంతో అతడిలో ఉత్సాహం పెరిగింది.



ఈ మెట్లు ఎక్కి దిగే వాకింగ్ తో సరదాగా ఒక రికార్డు సృష్టిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే మెట్లు లెక్కించడానికి గూగుల్‌ ఫిట్‌లో ‘స్టెప్స్‌ యాప్‌’ హెల్ప్ తో గత సెప్టెంబర్‌ 20న అర్థరాత్రి 12 గంటలకు ఇంట్లోనే నడక ప్రారంభించాడు. అలా అర్థరాత్రి ప్రారంభించి సాయంత్రం 7.55 గంటలకు పూర్తి చేశాడు. అంటే 19 గంటల 55 నిమిషాల్లో అతడు అక్షరాల ఒక లక్షా నూట ఇరవై ఎనిమిది మెట్లు ఎక్కి దిగాడు.ఆ దూరం మొత్తం లెక్కిస్తే 67.8 కిలోమీటర్లుగా నమోదయ్యింది. ఈ రికార్డును గుర్తించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నిర్వాహకులు అతడికి అక్టోబర్‌ 3న సర్టిఫికెట్‌ కూడా ప్రదానం చేశారు.
https://10tv.in/uk-london-pregnant-women-wakes-up-from-coma-to-find-she-had-given-birth-to-twins/


దీని గురించి సూర్యవంశీ మాట్లాడుతూ..ఆరుబయట నడకకు, ఇంట్లో నడకకు చాలా తేడా ఉంటుంది. ఏకబికిన ఇంట్లో మెట్లు ఎక్కి దిగటం అంత ఈజీ కాదనీ అలా చేయటం వల్ల ఊపిరి పీల్చు కోవడం కూడా కష్టమవుతుందని తెలిపాడు.కానీ రికార్డు క్రియేట్ చేయాలనే టార్గెట్ గా పెట్టుకుని చేశానని దానికి తగిన ఫలితం దక్కిందని సంతోషం వ్యక్త చేశాడు.



నడక ప్రారంభించిన తర్వాత ప్రతీ గంటకు ఒక నిమిషం పాటు బ్రేక్‌ తీసుకునేవాడిననీ..ఆ నిమిషం గుండెల నిండా చక్కగా శ్వాస తీసుకోవటానికే సరిపోయేదనీ..ఆ తరువాత క్రమక్రమంగా టైమ్ పొడిగించుకుంటూ కొన్ని గంటల తర్వాత ఐదు నిమిషాల బ్రేక్‌ ఇచ్చేవాణ్ణి. ఆ ఐదు నిమిషాలు కాళ్లకు నొప్పిని కొంతలో కొంత తగ్గించుకోవటానికి ఆయింట్‌మెంట్స్‌ రాస్తూ తిరిగి నడక కొనసాగించేవాడినని తెలిపాడు సూర్యవంశీ.



కాగా కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితం కావడంతో ఫిట్‌నెస్‌ వైపు దృష్టి సారించి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సూర్యవంశీ. ప్రతీరోజూ
ఇంట్లోనే 10 వేల మెట్లు ఎక్కి దిగుతూ..రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడు. అదే అతనిలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి రికార్డు క్రియేట్ చేయాలనే ఆలోచన తీసుకొచ్చింది.



గతంలో తాను ఉద్యోగం నిమిత్తం లోకల్‌ ట్రెయిన్‌లో ప్రయాణించేవాడినని..దాంట్లో భాగంగా అరగంట పాటు ట్రైన్ లో నిలబడితేనే ఒళ్లంతా చెమటలు పట్టేసేవి..కాళ్లు నొప్పులు పుట్టేవి..ఆఫీసుకు వెళ్లే సరికే అలసిపోయేవాడిని..శ్వాస కూడా ఆడేది కాదు…కానీ బరువు తగ్గాక ఎంత నడిచినా ఆయాసం రావటంలేదని తెలిపాడు.ఈక్రమంలో వచ్చిన లాక్‌డౌన్‌ తో ఆ ఖాళీ సమయంలో నడక మొదలు పెట్టి నా భారీ కాయాన్ని కరిగించాను. 15 కిలోల బరువు తగ్గాను..నెమ్మదిగా ఇంట్లోనే ఒక ప్రయత్నం చేశా. అది సక్సెస్‌ కావడంతో రికార్డు క్రియేట్ చేయాలని తపనతో ఇలా చేసానని తన కష్టానికి తగిన ప్రతిఫలం ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ద్వారా నెరవేరిందని తెలిపాడు సూర్యవంశీ.



నడకతోపాటు డైట్‌ కూడా చాలా ఇంపార్టెంట్…
బరువు తగ్గేందుకు ఇంట్లోనే మెట్లు ఎక్కి దిగే వ్యాయామం చేద్దామనుకున్న సూర్యవంశీ దానికి తగిన ఆహారం ఏం తినాలి? ఎంత తినాలి? ఏఏ సమయాల్లో తినాలి? ఎంతెంత తినాలి? అనేదానిపై నిపుణుల సలహాతో జాగ్రత్తలు తీసుకున్నాడు. చక్కటి డైట్‌ను ఫాలో అయ్యాడు. దాంట్లో భాగంగా.. ప్రతీరోజూ ఉదయం మూడు ఉడికించిన గుడ్లు..మొలకలు..పోహా వంటివి డైట్ లో చేర్చుకున్నానని తెలిపాడు సూర్యవంశీ.



అలాగే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీలు, లంచ్‌లోకి చపాతీలు, వెజ్‌ కర్రీ, సలాడ్‌… రాత్రి
డిన్నర్‌లోకి రెండు రొట్టెలు, వెజ్‌ కర్రీ వంటివి ఫాలో అయ్యాడు. అంతేకాదు జంక్‌ఫుడ్‌కు పూర్తిగా ఎవైడ్ చేశాడు. మొదట్లో రోజుకు రెండు కిలోమీటర్ల టార్గెట్ తో క్రమక్రమంగా ఐదు కిలోమీటర్లకు పెంచుకుంటూ వెళ్లి ఆఖరికి రికార్డు దిశగా పయనించి అనుకున్నది సాధించాడు. ఈ రికార్డుతో సూర్యవంశీ థానేలో సెలబ్రిటీ అయిపోయాడు.