Schools Open: వచ్చేవారం నుంచే స్కూళ్లు ప్రారంభం – మంత్రి ప్రకటన!

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను స్టార్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్షా గైక్వాడ్.

Schools Open: వచ్చేవారం నుంచే స్కూళ్లు ప్రారంభం – మంత్రి ప్రకటన!

Maharashtra to reopen schools for classes

Schools Open: కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను స్టార్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్షా గైక్వాడ్. మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్ష మాట్లాడుతూ, మహారాష్ట్రలో జనవరి 24వ తేదీ నుంచి కోవిడ్ ప్రోటోకాల్స్‌తో పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ ప్రతిపాదనకు అంగీకరించారని వెల్లడించారు మంత్రి.

డిసెంబర్ నెల ప్రారంభంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత.. కరోనావైరస్ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో COVID కేసులు పెరిగిన తర్వాత, పాఠశాల (ఆఫ్‌లైన్) సెషన్‌లను కొనసాగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ నిపుణులతో చర్చించిన తర్వాత, స్థానిక COVID-19 పరిస్థితి ఆధారంగా కేసుల సంఖ్య తక్కువగా ఉన్న సెషన్‌లను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రికి ఈమేరకు ప్రతిపాదన పంపగా.. సోమవారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం గురించి ఆలోచించాలని.. అందుకోసం అధికారులకు(మునిసిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, విద్యాశాఖాధికారులు) ఆదేశాలు జారీచేయాలని పాఠశాల విద్యాశాఖా మంత్రిని కోరారు.

Duniya Vijay : బాలయ్య విలన్‌కి బర్త్‌డే విషెస్..

ఈ వారంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి సానుకూలంగా పరిశీలిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి. 15 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మంత్రి, టీచింగ్.. నాన్ టీచింగ్ సిబ్బందికి పూర్తిగా వ్యాక్సిన్లు వేయాలని కోరారు.