Maharashtra : తిరగబడ్డ ఎలక్ట్రానిక్ వస్తువుల కంటైనర్..లూటీ చేసిన జనాలు

మహారాష్ట్రలో ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి తిరగబడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ట్రక్ వద్దకు భారీగా తరలి వచ్చి..అందిన కాడికి ఎలక్ట్రానిక్ వస్తువులను లూటీ చేసుకుపోయారు. ఎవరికి దొరికిన వస్తువుల్ని వారు పట్టుకుపోయారు.సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్‌ఈడీలు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఉడాయించారు.

Maharashtra  : తిరగబడ్డ ఎలక్ట్రానిక్ వస్తువుల కంటైనర్..లూటీ చేసిన జనాలు

Truck Overturns..people Loot Electrical Goods (1)

Truck Overturns..People Loot Electrical goods : మహారాష్ట్రలో ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి తిరగబడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ట్రక్ వద్దకు భారీగా తరలి వచ్చి..అందిన కాడికి ఎలక్ట్రానిక్ వస్తువులను లూటీ చేసుకుపోయారు. ఎవరికి దొరికిన వస్తువుల్ని వారు పట్టుకుపోయారు.సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్‌ఈడీలు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఉడాయించారు. వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళుతున్న ట్రక్కు సోమవారం తెల్లవారుఝామున 3గంటల సమయంలో తిరగబడడంతో అక్క‌డున్న జ‌నం ఆ ట్ర‌క్కులోని రూ. 70 ల‌క్ష‌లు విలువ‌చేసే ఫోన్ల‌ను ఎత్తుకెళ్లిపోయారు.

దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారి ఘటనాస్థలానికి చేరుకునేసరికే చాలా వరకూ వస్తువులు లూటీ జరిగినట్లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాట్లాడుతూ.. ఘ‌టన‌ వాషి తహసీల్ ప‌రిధిలోని షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై ట్రక్కు బోల్తా పడిందని..దాంట్లోని ఎలక్ట్రికల్ వస్తువులు లూటీ అయ్యాయనీ..లూటీ అయిన వాటిలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్‌ఈడీలు, బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయని తెలిపారు.

ఆ రోడ్డు మీదుగా వెళుతున్న‌వారితో పాటు సమీపంలోని గ్రామస్తులు కూడా వచ్చిన వ‌స్తువుల‌ను ఎత్తుకెళ్లిపోయారు. మ‌రికొంద‌రు కంటైనర్ తలుపును ధ్వ‌సంచేసి మ‌రీ విలువైన వ‌స్తువుల‌ను లూటీ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో పోలీసులు స్థానికులను విచారించగా..ఎవరెవరెవరు ఏఏ వస్తువుల్ని ఎత్తుకెళ్లారో కనిపెట్టారు. అలా వారు స్థానికులను మీరు పట్టుకెళ్లిన ప్రతీ వస్తువు ఇచ్చేయాలని హెచ్చరించటంతో కొంద‌రు వారు తీసుకున్న వ‌స్తువుల‌ను తిరిగి అప్ప‌గించారు. మ‌రికొంద‌రు వ‌స్తువుల‌ను తిరిగి ఇవ్వ‌లేదు. కానీ వారు ఫలానా వస్తువులు పట్టుకెళ్లినట్లుగా రుజువు లేదు కాబట్టి ..మరోసారి గ్రామస్థులను పోలీసు అధికారి విజ్ఞప్తి చేశారు. దయచేసి పట్టుకెళ్లిన వస్తువుల్ని ఇచ్చాయని కోరటంతో మరికొంతమంది ఇచ్చేశారు. కానీ కొంతమంది మాత్రం ఇవ్వనట్లుగా తెలుస్తోంది.