డైలీ 18 కిలోమీటర్లు పడవ నడుపుకుంటూ వెళ్లి విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ వర్కర్

10TV Telugu News

Maharashtra: నదిపై సూదూరంగా ప్రయాణించడం అంటే తప్పని పరిస్థితుల్లో మాత్రమే సాహసిస్తాం. కానీ, 27ఏళ్ల రేలు వాసవె అనే అంగన్వాడీ వర్కర్ మాత్రం డైలీ పడవపై వెళ్లి అక్కడ ఉండిపోయిన గిరిజనులకు సేవలు అందిస్తుంది. కరోనావైరస్ భయం మొదలవడంతో గిరిజనులంతా అంగన్వాడీకి రావడమే మానేశారు. రోడ్ ప్రయాణం కష్టంగా మారింది.

దీంతో ఆమె ఒకటి డిసైడ్ అయింది. చేపలు పట్టే వ్యక్తి నుంచి పడవను అద్దెకు తీసుకుంది. అలీగట్, దాదర్ ప్రాంతాలకు వెళ్లి 25మంది కొత్తగా పుట్టిన శిశువుకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు గర్భిణీలుగా ఉన్న ఏడుగురికి న్యూట్రిషన్ సలహాలు ఇచ్చి వస్తుంది.ఏప్రిల్ నుంచి వారానికి ఐదు రోజులు వెళ్లి రావడానికి 9కిలోమీటర్ల దూరం ఉండే ప్రదేశానికి పడవపైనే వెళ్లి వస్తుంది. మహారాష్ట్రలోని నందూర్‌బార్ గ్రామంలో రేలు పనిచేస్తుంది. ఆమె పని కొత్తగా పుట్టిన శిశువులు ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, ఆరేళ్ల లోపు పిల్లల హెల్త్ గురించి సలహాలివ్వడం, వారి బరువులు వంటివి చెక్ చేసి ప్రభుత్వం ఇస్తున్న న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ను అందజేయడం.

మార్చిలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి గిరిజనులు ఆ ప్రాంతం నుంచి అంగన్వాడీకి రావడం క్రమంగా తగ్గించేశారు. వారంతా విడివిడి బోట్లలో వచ్చి ఆహారాన్ని తీసుకెళ్లేవారు. వారు రాలేకపోతుండటంతో ఇంత సాహసం చేసి వెళ్తున్న రేలుకు చిన్నతనం నుంచే ఈత తెలుసట.

anganwadi worker

దీని కోసం రోజూ అంగన్వాడీకి ముందుగానే వెళ్తుందట. ఉదయం 7గంటల 30నిమిషాలకే వెళ్లి పని పూర్తి చేసుకుని లంచ్ చేస్తుంది. ఆ తర్వాత బోట్ లో ఆ ప్రాంతానికి ఫుడ్ సప్లిమెంట్స్ తో పాటు పిల్లలు బరువు చూసుకునే పరికరాన్ని కూడా తీసుకెళ్తుంది.

కొన్నిసార్లు తనతో పాటు అంగన్వాడీలో పనిచేసే సంగీత ఆమెకు సాయం చేస్తుంటుంది. పడవ నడిపిన తర్వాత వారి దగ్గరకు వెళ్లి బాధ్యతలు పూర్తి చేసుకుంటుంది.

‘ప్రతిరోజూ పడవ నడపడం అంత ఈజీ కాదు. ఇంటికి తిరిగొచ్చేసరికి చేతులు నొప్పిపెడతాయి. అది నాకు బాధగా అనిపించదు. పిల్లల ఆరోగ్యం, ఆ తల్లులు తీసుకునే ఆహారం గురించే నా బెంగ. కొవిడ్ పరిస్థితి నుంచి బయటపడేవరకూ తప్పదు’ అని ఆమె చెప్పింది.

నిస్వార్థమైన రేలు సేవలకు ఆ గిరిజనులు చాలా సంతోషిస్తున్నారు. ‘మా ఆరోగ్యం గురించి కేరింగ్ తీసుకుంటుంది. ప్రశ్నలు అడిగి తెలుసుకుంటుంది’ అని చెప్తున్నారు గిరిజనులు.

ఆమె సేవలు సీఎం ఉద్ధవ్ ఠాకరేకు తెలిశాయి. నందూర్బర్ జిల్లా పరిషత్ శేఖర్ రౌండల్ ఆమె దగ్గరకు వెళ్లి సీఎం ఉద్ధవ్ ఠాకరే ప్రశంసలు తెలియజేయనున్నారు.

10TV Telugu News