Maharashtra : వానలతో మహారాష్ట్ర అతలాకుతలం, రైళ్లలో చిక్కుకున్న 6 వేల మంది

మహారాష్ట్రపై వరణుడు పగబట్టాడు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Maharashtra : వానలతో మహారాష్ట్ర అతలాకుతలం, రైళ్లలో చిక్కుకున్న 6 వేల మంది

Maha

Maharashtra Konkan : మహారాష్ట్రపై వరణుడు పగబట్టాడు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాయిగడ్, రత్నగిరి, పూణే సతారా, కొల్హాపూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ముంబై, పాల్ఘార్, థానే ప్రాంతాలకు ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలతో కొంకణ్‌, ముంబై మెట్రోపాలిటన్‌, విదర్భలో పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

Read More : Modi Cabinet: లడఖ్‌పై కేంద్రం వరాలు.. కీలక ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం!

కొంకణ్ లో భారీ ఆస్తినష్టం :-
ప్రధానంగా కొంకణ్ ప్రాంతం భారీగా నష్టపోయింది. వర్షాల ధాటికి పలు రైళ్లల్లో 6 వేల మంది ప్రయాణీకులు చిక్కుకపోయారని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. రత్నగిరి జిల్లాలోని అనేక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. ముంబైకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న Chiplun ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. తీవ్ర వరదలు రావడంతో ముంబై – గోవా హైవే మూసివేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది.

Read More : Priyamani : తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించిన ప్రియమణి..

వశిష్ట నది :-
వశిష్ట నది ఉప్పొంగడంతో చిప్లున్ టౌన్‌ వరదనీటిలో మునిగిపోయింది. ఇళ్లలోకి నీరు చేరింది. ఫస్ట్‌ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు కొల్హాపూర్ వద్ద పంచ గంగా నది, సాంగ్లి వద్ద కృష్ణా నదులు ఉధృతంగా మారాయి. సతారాలోని కోయన డ్యాం నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. బస్సులు నీట మునిగాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లోని బాధితులను రెస్క్యూ టీమ్స్‌ రక్షిస్తున్నాయి. తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Read More : Karnataka : సీఎంగా యడియూరప్పను తొలగిస్తే బీజేపీకి నష్టమే : సుబ్రహ్మణ్యస్వామి

అల్లకల్లోలంగా సముద్రం :-
సహాయక చర్యలు జరుగుతున్న ఖేడ్ ప్రాంతంలో పరిస్థితి భయానకరంగా ఉంది. జగ్బుడి నది ప్రమాదరకరస్థాయికి మించి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. NDRF టీమ్ లు ముంబైలో నాలుగు, థానే, పాల్ఘర్ జిల్లాల్లో ఒక్కొక్కటితో సహా 9 రెస్క్యూ టీమ్ లను మోహరించింది. ఒక బృందం చిప్లూన్ కు వెళ్లనుంది. రెండు బృందాలను కొల్లాపూర్ కు పంపారు అధికారులు. మరోవైపు అరేబియా సముద్రం అల్లల్లోలంగా మారింది. మెరైన్ డ్రైవ్ వెంబ‌డి స‌ముద్ర తీరంలో అల‌లు ఉవ్వెత్తున్న ఎగిసిప‌డుతున్నాయి. దాదాపు మూడు నుంచి ఐదు మీట‌ర్ల ఎత్తుతో అల‌లు తీరాన్ని తాకుతున్నాయి. దీంతో భారీగా బురద, చెత్తా చెదారం వచ్చి పడుతోంది. ముంబైలో అలల నుంచి వస్తున్న చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ్య సిబ్బంది.

Read More : వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు

రేపు భారీ వర్షాలు :-
భారీస్థాయిలో వర్షాలు, వరదలు పోటెత్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం థాకరే సూచించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంబైలో నిన్న రికార్డు స్థాయిలో 19 వందల 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. గుజరాత్ తీరం నుంచి కేర‌ళ తీరం వ‌ర‌కు కూడా ఏక‌ధాటిగా వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. ప‌శ్చిమ తీరం మొత్తం అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్లు ఐంఎడీ తెలిపింది. కొంక‌న్‌తో పాటు గోవా, మ‌ధ్య మ‌హారాష్ట్ర, కోస్టల్ క‌ర్నాట‌క ప్రాంతాల్లోనూ రేపు భారీ వ‌ర్షాలు పడతాయని తెలిపింది.