Maharashtra : లేడి సింగమ్ ఆత్మహత్య, ప్రకంపనలు సృష్టిస్తున్న సూసైడ్ నోట్

మహారాష్ట్రలో లేడీ సింగమ్ గా గుర్తింపు పొందిన రేంజ్ ఆఫీసర్ దీపాలి చవాన్ మొహితే ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Maharashtra : లేడి సింగమ్ ఆత్మహత్య, ప్రకంపనలు సృష్టిస్తున్న సూసైడ్ నోట్

Maharashtra’s Lady Singham

Lady Singham : మహారాష్ట్రలో లేడీ సింగమ్ గా గుర్తింపు పొందిన రేంజ్ ఆఫీసర్ దీపాలి చవాన్ మొహితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. టైగర్ రిజర్వ్ సమీపంలోని హరిసాల్ గ్రామంలో ఉన్న అధికారిక క్వార్టర్స్ లో తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు. ఈమె భర్త రాజేశ్ మొహితే చిఖల్ ధారలో ట్రైజరీగా అధికారిగా పనిచేస్తున్నారు. సూసైడ్ నోట్ లో పేర్కొన్న నిందితులను అరెస్టు చేసేంత వరకు దీపాలి మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రసక్తే లేదని కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు.

దీపాలి అంటేనే…అటవీ మాఫియాకు హఢల్. వారి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. అందరూ ఆమెను లేడీ సింగమ్ గా పిలుస్తుంటారు. అయితే..ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందో…నాలుగు పేజీల లేఖలో ఆమె వెల్లడించారు. ఐఏఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ తనను వేధించే వాడని, ఎలా వేధించాడు..మానసికంగా టార్చర్ పెట్టింది..ఇతరత్రా విషయాలను ఆమె అందులో పేర్కొన్నారు.

తన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశాడో..వివరించారామె. లైంగిక వేధింపుల విషయాన్ని సీనియర్, ఎంటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ ఎంఎస్ రెడ్డి (IFS)కు ఫిర్యాదు చేసినా..స్పందించలేదని ఆరోపించారు. అందరి ముందు, ప్రైవేటుగా తనను అసభ్యపదజాలంతో దూషించే వాడని, తాను దూరంగా పెట్టడంతో కష్టమైన అసైన్ మెంట్స్, వర్క్ షెడ్యూల్ ఇచ్చేవాడని తెలిపింది. తన జీతాన్ని నెల రోజుల పాటు హోల్డ్ లో ఉంచి..ఇబ్బంది పెట్టాడని, 2020లో వివాహం చేసుకున్న తర్వాత..గర్భవతిగా ఉన్న సమయంలో…కిలో మీటర్ల దూరం నడిపించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. వందలాది కిలోమీటర్లు తిప్పినట్లు వెల్లడించింది. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యిందని దీపాలి సన్నిహితురాలు తెలిపారు.

మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ శివ కుమార్ ను పోలీసులు నాగ్ పూర్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు వెళ్లేందుకు రైలు కోసం ఎదురు చూస్తుండగా..పోలీసులు అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని, నిందితులు ఎవరైనా వదిలిపెట్టమని తెలిపారు.