Maharashtra : బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కు కోటిన్నర ఖర్చుపెట్టాడు..

కరోనా వచ్చి కోలుకున్నాం అని సంతోష పడినంతసేపు ఉండటంలేదు. బ్లాక్ ఫంగస్, వైట్ , ఎల్లో ఫంగస్ లు దాడి చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు నిలస్తాయనే ఆశలు కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చు ఆ రేంజ్ లో ఉండటమే. ఈక్రమంలో మహారాష్ట్రలో ఓ వ్యక్తి కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి చికిత్స చేయించుకన్నాడు. ఒక కన్ను పోగొట్టుకున్నా ప్రాణాలతో బయటపడ్డాడు.

Maharashtra  : బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కు కోటిన్నర ఖర్చుపెట్టాడు..

Black Fungus (2)

Maharashtra Man black fungus effect : కరోనా వచ్చి కోలుకున్నాం అని సంతోష పడినంతసేపు ఉండటంలేదు. బ్లాక్ ఫంగస్, వైట్ , ఎల్లో ఫంగస్ లు దాడి చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు నిలస్తాయనే ఆశలు కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చు ఆ రేంజ్ లో ఉండటమే. దీంతో కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ప్రశాంతంగా ఉండటానికి లేని పరిస్థితులు. కొంతమంది ఆస్తులు అమ్మి మరీ బ్లాక్ ఫంగస్ కు చికిత్స్ చేయించుకుంటున్నారు. కానీ ఆ స్తోమత లేని వాళ్లు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఫంగస్ కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అంతంత మాత్రంగానే ఉంటోంది.

ఈక్రమంలో కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ సోకిన ఓ వ్యక్తి ఏకంగా చికిత్స కోసం కోటి రూపాయలకు పైనే ఖర్చుపెట్టిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని విదర్భకు చెందిన నవీన్ పాల్ అనే 46 ఏళ్ల వ్యక్తి బ్లాక్ ఫంగస్ సోకి ఓ కన్ను కోల్పోయాడు. కానీ ప్రాణాలు దక్కించుకోవటం కోసం నవీన్ పాల్ ఏకంగా రూ.కోటిన్నర ఖర్చు చేసి చికిత్స పొందాడు.

ఇప్పుడంటే బ్లాక్ ఫంగస్ కేసులు సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ గత అక్టోబర్ లోనే బ్లాక్ ఫంగస్ సోకిన నవీన్ పాల్ కేసు మొదటిది. దీంతో అప్పటికి బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ గురించి పెద్దగా అవగాహన లేకపోవటంతో నవీన్ పాల్ ఓ కన్ను కోల్పోయాడు. ఆ తరువాత బ్లాక్ ఫంగస్ ఇబ్బంది పడుతూ దాదాపు ఆరు ఆసుపత్రుల్లోనే గడిపాడు. ఆ ఆరు నెలల్లో 13 ఆపరేషన్లు చేయించుకుని ఎట్టకేలకు నవీన్ పాల్ కోలుకున్నాడు. నవీన్ పాల్ భార్య రైల్వే ఉద్యోగి కావటంతో అంత ఖర్చును భరించగలిగాడు. కారణం అతనికి అయిన ఖర్చు అంతా రైల్వే శాఖ భరించటం వల్ల బతికి బైటపడగలిగాడు బ్లాక్ ఫంగస్ బారి నుంచి. నవీన్ పాల్ చికిత్సకు అయిన ఖర్చులో రూ.48 లక్షలు నవీన్ భరించగా మిగిలిన ఖర్చు అంటూ రైల్వే శాఖ భరించింది. అప్పికే ఓ కన్ను పోగొట్టుకున్నా ప్రాణం దక్కింది చాలు అనుకుంది నవీన్ పాల్ భార్య..అతని కుటుంబం.

ఈ సందర్బంగా నవీన్ పాల్ మాట్లాడుతూ..తనకు గత సెప్టెంబర్ లో కరోనా సోకింది. హాస్పిటల్ లో చికిత్స తరువాత కోలుకుని ఇంటికొచ్చేశాను. కానీ కొన్ని రోజులకే పన్ను, కన్ను బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సమస్య ఏమిటో తెలియకపోయినా..నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాను. ఆ తరువాత హైదరాబాద్ కు వెళ్లగా అక్కడి డాక్టర్లు నాగ్ పూర్ కు పంపించారు. అలా నాగ్ పూర్ నుంచి ముంబైలో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఇలా చికిత్స కోసం ఎన్నో నగరాలు తిరిగాను.

ముంబై హాస్పిటల్ లో కేవలం కొన్ని రోజులకే హాస్పిటల్ బిల్లు రూ.20 లక్షలు వేశారు. దీంతో చేతిలో ఉన్న డబ్బు అంతా అయిపోవచ్చింది. దీంతో ఇక అంత ఖర్చు భరించలేక మళ్లీ నాగ్ పూర్ వచ్చేసి..ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే కన్ను బాగా ఇన్ ఫెక్ట్ అవ్వటంతో కన్ను తీసేయాల్సి వచ్చింది. నాగ్ పూర్ హాస్పిటల్ లోనే డాక్టర్లు కన్ను తీసేశారు. కానీ కన్ను పోయినా ప్రాణం దక్కినందుకు సంతోషంగా అనిపించింది. నా కుటుంబం కూడా అదే అంది. ప్రాణం దక్కితే అంతే చాలు అనుకున్నాడు.