హే గాంధీ : జాతిపిత జయంతి మరుసటి రోజే దారుణం

అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ చిత్రపటాలకు నివాళి అర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 02:25 AM IST
హే గాంధీ : జాతిపిత జయంతి మరుసటి రోజే దారుణం

అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ చిత్రపటాలకు నివాళి అర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను

అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ చిత్రపటాలకు నివాళి అర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ జయంతి మరుసటి రోజే దారుణం జరిగింది. ఏకంగా మహాత్మా గాంధీ చితాభస్మాన్ని చోరీ చేశారు దుండగులు. మధ్యప్రదేశ్ లోని రేవాలో ఉన్న మహాత్మా గాంధీ స్మారకం బాపూ భవన్ నుంచి కొందరు దుండగులు మహాత్ముని చితాభస్మాన్ని దొంగిలించారు. అంతేకాదు.. గాంధీ చిత్రపటంతో కూడిన పోస్టర్ ను చించేశారు. జాతి వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ ఘటన సంచలనం రేపింది.

ఈ దుశ్చర్యపై స్థానిక కాంగ్రెస్ నేత గుర్మీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దుండగుల చర్య జాతీయ సమైక్యతకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. బాపూను గాడ్సే చంపిన తర్వాత… ఆయన చితాభస్మాన్ని రేవా సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న స్మారక ప్రదేశాల్లో నిక్షిప్తం చేశారు. గాంధీ చితాభస్మాన్ని దొంగిలించిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటలను పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతున్నారు.