గోమాతకు గొప్ప గౌరవం : వేద మంత్రోచ్ఛారణలతో..అంతిమ యాత్ర

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 04:58 AM IST
గోమాతకు గొప్ప గౌరవం : వేద మంత్రోచ్ఛారణలతో..అంతిమ యాత్ర

తన కుటుంబానికి ఎంతో సేవలు చేసిన ఓ గోమాతకు ఓ రైతు అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు. తన ఇంటిలో మనిషిగా చేసుకున్న ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తమ ఇంటిలో వ్యక్తి చనిపోతే ఎటువంటి అంత్యక్రియలు చేస్తామో అన్ని ఆ ఆవుకు సంప్రదాయ బద్దంగా వేద మంత్రోచ్ఛరణలతో చేశాడు. 

యూపీలోని మహోబా జిల్లాలోని జైత్‌పూర్ పరిధిలోని ముఢారీ గ్రామంలోని బలరామ్ మిశ్రా అనే రైతు ఇంటిలో ఓ ఆవు చనిపోయింది. ఆ ఆవుకు బలరామ్ ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. బలరామ్ ఇంట 20 ఏళ్ల క్రితం ఓ  గోవుదూడ  పుట్టింది. ఆవు దూడ గోవుకు ‘కృష్ణ’ అనే పేరుపెట్టుకున్నారు.  దాన్ని ఇంటిలో మనిషిగా ఎంతో ఆదరంగా పెంచుకున్నారు. ఆ దూడ పెరిగి పెద్దైంది. ఆవుగా మారింది. ఎన్నో దూడల్ని కన్నది. ఈ క్రమంలో ఆ ఆవు ఒక దూడకు జన్మనిచ్చిన తరువాత చనిపోయింది. 

దీంతో రైతు కుటుంబం ఎంతగానో వేదన చెందారు. ఇంటిలో వ్యక్తిలా పెంచుకున్న ఆ గోవును ఏదో ఒక జంతువు చనిపోతే పడేసినట్లుగా పడేయటం వారికి మనస్సు ఒప్పలేదు. దీంతో మనిషికి చేసినట్లుగానే గోమాతకు మనిషికి చేసినట్లుగా అంత్యక్రియలు జరపాలనుకున్నారు.  దీంట్లో భాగంగా..ఆ గోవు మృత కళేబరానికి ఎర్రని వస్త్రాన్ని కప్పాడు. 

దానిని ఎడ్లబండిలో ఉంచి.. ఘనంగా ఊరేగింపు నిర్వహించాడు. వేదమంత్రోచ్ఛారణలతో ఆ ఆవుకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బలరామ్ మాట్లాడుతూ ‘కృష్ణ మా కుటుంబానికి తల్లి లాంటిది. మాకు ఎన్నో సేవలు చేసింది. కృష్ణా.. అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా దగ్గరకు వచ్చేది. అటువంటి మా అమ్మ మాకు దూరమయ్యింది. అందుకే ‘కృష్ణ’కు ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించామని తెలిపారు.గోవు అస్తికలను పవిత్ర నదిలో కలపుతామని తెలిపారు.