Dimple Yadav: మెయిన్‌పురి ఉప ఎన్నిక బరిలో డింపుల్ యాదవ్.. ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న అఖిలేష్ సతీమణి

ఉత్తర ప్రదేశ్, మెయిన్‌పురి లోక్ సభ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎంపీగా ఉన్న యులాయం సింగ్ యాదవ్ మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది.

Dimple Yadav: మెయిన్‌పురి ఉప ఎన్నిక బరిలో డింపుల్ యాదవ్.. ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న అఖిలేష్ సతీమణి

Dimple Yadav: ఉత్తర ప్రదేశ్, మెయిన్‌పురి ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆమె సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సతీమణి. మెయిన్‌పురి లోక్ సభ స్థానం నుంచి గతంలో ఇదే పార్టీ తరఫున యులాయం సింగ్ యాదవ్ ఎంపీగా ఎన్నికయ్యారు.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

అయితే, ఆయన ఇటీవలే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే నెల 5న ఎన్నిక జరగనుండగా, 8న ఫలితం వెల్లడిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇదే రోజు మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. రాంపూర్ సదర్‌తోపాటు, కతౌలి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఆర్ఎల్‌డీ (రాష్ట్రీయ లోక్ దళ్)తో కలిసి పోటీ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించింది.

రాంపూర్ సదర్‌, కతౌలి అసెంబ్లీ ఉప ఎన్నికలకు కారణం.. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరినీ ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటిస్తూ నిషేధం విధించింది. రాంపూర్ సదర్ ఎమ్మెల్యేగా ఉన్న మొహమ్మద్ ఆజాం ఖాన్‌పై విద్వేషపూరిత ప్రసంగం చేసిన కారణంగా అనర్హత వేటు పడింది.