స్మోగ్ బ్రేక్ : స్కూళ్లకు సెలవులు ఇవ్వండి

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 01:45 AM IST
స్మోగ్ బ్రేక్ : స్కూళ్లకు సెలవులు ఇవ్వండి

ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారు గాలి పీల్చాలంటే..కష్టంగా మారిపోయింది. ఊపిరి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయినా..వాయు కాలుష్యం డేంజర్‌ గా మారడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.

కాలుష్యం కారణంగా పెద్దలు బయటకు రాలేకపోతున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. పిల్లల ఆరోగ్యం ఏంకావాలి.. వారు కచ్చితంగా రోగాల బారిన పడతారని వైద్యులు తెలిపారు. దీంతో పేరెంట్స్ అందరూ ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి రెండు వారాల్లో పాఠశాలలకు ‘స్మోగ్ బ్రేక్’ షెడ్యూల్ చేయాలని నేషనల్ కాపిటల్ రీజియన్ (NCR)ను చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. 

కావాలంటే ఇప్పుడు ఇచ్చే సెలవుల వల్ల పిల్లలు నష్టపోతారని అనుకుంటే.. ఇతర కాలాల్లో సెలవుల్ని తగ్గించండి అంటూ పేరెంట్స్ కోరారు. నిజానికి ఈసారి ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం నవంబర్‌ లో చాలా రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కానీ ప్రకటించిన సెలవుల్ని భర్తీ చేసే ప్రక్రియ మాత్రం చేపట్టలేదు.