దేశమంతా వివిధ పేర్లతో జరుపుకునే సంక్రాంతి

  • Edited By: chvmurthy , January 14, 2020 / 11:35 AM IST
దేశమంతా వివిధ పేర్లతో జరుపుకునే సంక్రాంతి

సంక్రాంతి దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకునే  పండుగ. సంక్రాంతి అని తెలుగునాట అన్నా పొంగల్ అని తమిళ తంబి పలికినా  మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సంక్రాత్ అని పిలిచినా జనవరి 14న ఒకే విధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండగకు కొత్త పంట ఇంటికి వస్తుంది. మిగిలిన భారతీయ పండుగలకు విభిన్నంగా నిలబడటానికి కారణం మకర సంక్రాంతికి ఒక తేదీ నిర్ణయింపబడింది. 
SANKRANTI AP TELANGANA

 

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవటం జరుగుతుంది.  ప్రతి 30  రోజుల కొకసారి సూర్యుడు తాను ఉన్నరాశినుంచి వేరొక రాశిలోకి ఫ్రవేశిస్తూ ఉంటాడు. మకరంనుంచి కర్కాటకం దాకా సూర్యుడి పయనాన్ని ఉత్తరాయణం అని, కర్కాటకం నుంచి మకరం దాకా దక్షిణాయనం అని వ్యవహరిస్తారు.  ప్రతిసంవత్సరం జనవరి 14న భారతదేశం మొత్తం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి.

రాష్ట్రాల వారీగా విభిన్న సాంస్కృతిక రూపాలలో, విభిన్నపేర్లతో జరుపుకున్నప్పటికీ రైతు పండించిన పంట ఇంటికొచ్చే వేళలో చేసుకునే పెద్దపండుగ మకర సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్ లో  ఈ పండగ 3 రోజులు జరుపుతారు, మొదటి రోజు భోగి పండుగ . ఆరోజు ఇళ్లముందు, ప్రదాన కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. మరునాడు సంక్రాంతి . ఆ రోజు కొత్త బియ్యం, పాలు, బెల్లంతో చేసిన పొంగలి వంటకం తయారు చేస్తారు.  కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వస్తారు.  గ్రామీణ ప్రాంతాల్లోకోడి పందేలు  నిర్వహిస్తారు. పశువులు బండలాగుడు పోటీలు కూడా నిర్వహిస్తారు.  కనుమ రోజు పశువులను అందంగా అలంకరించి వాటిని, వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు.

MUGGULU

ఢిల్లీ, హర్యానా
ఢిల్లీ హర్యానాలలో సక్రాత్ లేదా సంక్రాంతిపేరుతో ఈ పండుగ జరపుకుంటారు.  ఈరోజు నేతితో చేసిన హల్వా, ఖీర్   ప్రత్యేకంగా వండుతారు. పండుగకు  వచ్చిన బావలకు బావమరుదులు కొత్త బట్టలు పెడతారు దీన్ని సిధ్ధ అని పిలుస్తారు. పెళ్లైన మహిళలు తమ అత్తమామలకు బహుమతులు ఇస్తారు దీన్ని మననా అంటారు. పురుషులందరూ కలిసి ఒక చోట కూర్చుని హుక్కా పీల్చుకుంటుంటే మహిళలు  జానపదాలు పాడుతూ ఆడతారు. 

KITES MAKERS

పంజాబ్ 
పంజాబ్ లో మకర సంక్రాంతి లేదా మాఘిగా  ఈపండుగను జరుపుకుంటారు. సంక్రాంతి రోజు తెల్లవారుఝూమున భక్తులు నదిలో స్నామం చేసి  నువ్వుల నూనె తో దీపాలు వెలిగించి వాటిని నదిలో వదులుతారు. ఇలా చేయటం వల్ల సంపద వృధ్ది చెందుతుందని అన్ని పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీముక్తసార్ సాహిబ్ వద్ద ప్రధాన మాఘి మేళా జరుగుతుంది. ప్రజలు సాంప్రదాయ భాంగ్రా నృత్యాన్ని చేస్తారు. ఆరోజు  పాలు, కొత్త బియ్యం,  చెరుకు రసంతో చేసిన  పాయసాన్ని వారు ఆరగిస్తారు. డిసెంబర్, జనవరి నెలల్లో పంజాబ్ లో అతిశీతల గాలులు వీస్తాయి. మాఘి పండుగ నుంచి చలిక్రమంగా తగ్గుతుంది, 

PUNJABI SANKRANTHI

రాజస్ధాన్ , పశ్చిమ మధ్యప్రదేశ్ 
రాజస్థాని భాషలో మకర సంక్రాంతి లేదా సంక్రాత్ పేరుతో ఈ పండుగ  జరుపుకుంటారు.  ప్రత్యేకమైన రాజస్థానీ వంటకాలతో పాటు ఫీని(తియ్యటిపాలు,లేదా చక్కెర సిరప్ లో ముంచినవంటకాలు) టిల్-పాతి, గజక్, ఖీర్ , ఘెవర్, పకోడి, పువా , నువ్వుల లడ్డూ వంటి స్వీట్లు ఈపండగకు ప్రత్యేకంగా వండతారు. ప్రత్యేకంగా మహిళలు ఈరోజు కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు  13 మంది ముత్తయిదువులకు పసుపు, కుంకుమ, ఫలాలతో వాయనం ఇస్తారు.  ఇంటి అల్లుడు తన అత్తమామలను బావమరుదులు, మరదళ్లను భోజనానికి  పండుగకు పిలుస్తారు. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇస్తారు.   చిన్న పెద్దా అందరూ  కలిసి గాలిపటాలు ఎగరేస్తారు.  జైపూర్, హడోటి ప్రాంతాలలో గాలిపటాల  పోటీలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో ఈ పోటీల్లోపాల్గోని  ఇతరుల గాలిపటాలను తెగ్గోట్టే పనిలో ఉంటారు. 

 

తమిళనాడు
తమిళనాడులో ఈ పండగను నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవరోజ ధాయ్ పొంగల్, 3మాట్టు పొంగల్, 4 వరోజు కనుమ చేస్తారు.  తమిళనాడులో సాంప్రదాయ బద్దంగా ప్రజలు పండుగ జరుపుకుంటారు, ఫశువులను అందంగా అలంకరిస్తారు, కొత్త బియ్యం , కొబ్బరి, చెరుకుగడ,  బెల్లంతో కలిపిని  పొంగలిని వండుతారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోజల్లి కట్టు పేరుతో ఎద్దుల పోటీలు నిర్వహిస్తారు. వీటివి విశేషజనాదరణ ఉంది. 

TAMILNADU SANKRANTHI
అస్సాం
అస్సాంలో ఈ పండుగను మాఘి  బిహూ అని కూడా పిలుస్తారు. జనవరి-ఫిబ్రవరి నెలల్లో పంట ముగిసే కాలంలో వచ్చే పండుగ. దాదాపు వారం రోజులపాటు వారు ఈ పండుగ చేసుకుంటారు భోగి మంటలు వేయటానికి ముందు రోజు, వెదురు,తాటాకులతో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసి వాటిలో ఆ రోజు ముందు భోజనం చేస్తారు, భోగి రోజు  వాటిని కాల్చేస్తారు.  తెలుగు వారు చేసుకునే పొంగల్ వంటి ఆహార పదార్ధం బియ్యం, కొబ్బరి, బెల్లం కలిపిన ఆహారాన్ని ప్రత్యేకంగా వండుతారు. భోగిమంటలువేసినప్పుడు జానపద నృత్యకారులు సాంప్రదాయ బిహు నృత్యం చేస్తారు. 

మహారాష్ట్ర
మహారాష్ట్రలో ప్రజలు సంక్రాంతి రోజు  హల్వా, నువ్వులు ఉండలు,  తయారు చేసుకుని ఒకరి కొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. మహారాష్ట్రలోని సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ లో జరిగే సంక్రాంతిని పోలి ఉంటుంది. నువ్వులు ఉండలు శీతాకాలంలో శరీరాన్నివెచ్చగా ఉంచటానికి ఉపయోగ పడుతుంది. 

MAHARASHTRA PONGAL
గోవా

గోవాలో కూడా మహారాష్ట్ర సంస్కృతిలో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. పండుగకు మహిళలు పసుపు కుంకుమ ఇచ్చి పుచ్చుకుంటారు. 

గుజరాత్ 
గుజరాత్ లోమకర సంక్రాంతి పేరుతో పిలిచే ఈ పండుగ 2 రోజులు  జరుపుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం, పాత ఉత్తరాయణ పుణ్యకాలం అని 14,15 తేదీల్లో జరుపుకుంటారు. వేరుశనగ, నువ్వుల తో చేసిన లడ్డూలు  ఈ పండుగకు ప్రత్యేకంగా చేసుకునే  వంటపదార్ధం.  గుజారాత్ లో సంక్రాంతికి ప్రధానంగా గాలిపటాలు ఎగరేస్తారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, మరియు జామ్‌నగర్‌లోని ప్రధాన నగరాల్లో ప్రజలు  గాలి  పటాల పోటీలు నిర్వహిస్తారు. 

gujarath

 హిమాచల్ ప్రదేశ్ 
హిమాచల్ ఫ్రదేశ్ లో ఈ  పండుగను మాఘాసాజీ అని పిలుస్తారు. సాజి అనేది సంక్రాంతికి పర్యాయపదం.  కొత్త నెల ప్రారంభం… మాఘమాసం కూడా నేటినుంచే ప్రారంభం అవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభ సూచికగా ఈ పండుగ చేసుకుంటారు.  ఈరోజు నుంచి వలస పక్షులు   తిరిగి వచ్చి కొండలపై సేద తీరుతాయి.  దేవాలయాల్లో దానధర్మాలు చేస్తారు. సాయంతం వేళల్లో సాంప్రదాయ నాతి జానపద నృత్యాన్ని  చేస్తారు. 

ఉత్తరాఖండ్ 
ఉత్తరాఖండ్ లోని కుమావున్ ప్రాంతంలో, మకర సంక్రాంతి గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. భారతీయ మత గ్రంథాల ప్రకారం, కుమావున్‌లో ఘుగుతి అని కూడా పిలువబడే ఉత్తరాయణి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు.  ప్రజులు ఈ రోజు పప్పు పవిత్ర నదుల్లో పుణ్య స్నానానాలు చేసి ధాన్యాలు, బియ్యం దానంగా ఇస్తారు.  నేతిలో  వేయించి తీసిన పిండి పదార్ధాలను కాకులకు ఆహారంగా పెడతారు.  ఉత్తరాఖండ్ లో కూడా వలస పక్షులు ఈరోజు నుంచి తిరిగి రావటం ప్రారంభంమవుతుంది.

ఉత్తర ప్రదేశ్ 
ఉత్తర ప్రదేశ్ లో ఈ పండుగను కిచేరి అని పిలుస్తారు. ఈరోజు  ప్రజలు పుణ్యనదుల్లో  స్నానం చేస్తారు. అలహాబాద్ మరియు వారణాసి మరియు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వంటి పుణ్య స్ధలాల్లో ఈరోజు దాదాపు  రెండు మిలియన్ల మంది ప్రజలు స్నానమాచరిస్తారని అంచనా. భారతదేశంలోని గుజరాత్, మహారాష్ట్రల మాదిరిగానే యువత ఇక్కడ గాలిపటాలు  ఉత్సాహంగా ఎగురేస్తారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే  సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లంతో చేసిన తీపి పదార్ధాలు ఉత్తర ప్రదేశ్ ప్రజలు చేసుకుంటారు.
UTTAR PRADESH SANKRANTHI
ఒడిషా 

ఒడిషాలో ప్రజలు మకర చౌలా  పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు.  కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు. కొబ్బరి వంటి వాటితో చేసిన ఆహార పదార్ధాలను తయారు చేస్తారు ,ముఖ్యంగా కోణార్కో లోని సూర్యదేవాలయానికి ఈరోజు భక్తులు పోటెత్తుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడిదర్శనం చేసుకుంటారు. 

పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ లో పౌష్ సంక్రాంతి పేరుతో ఈ పండుగ  జరుపుకుంటారు.  ప్రజలు గంగానది బంగాళా ఖాతంలో కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని పౌష్ పర్బన్ అనే పేరుతో కూడాజరుపుకుంటారు.  ఇక్కడి ప్రజలు ఖర్జూర పండును ఎక్కువగ ఉపయోగిస్తారు.  కొత్త బియ్యం, కొబ్బరి, బెల్లం ఖర్జూరాలతో తాయరు చేసిన ఖీర్, వివిధరకాల సాంప్రదాయ బెంగాలీ స్వీట్లలో ఉపయోగిస్తారు.  దీనిని  పితా అని పులుస్తారు.  3రోజులపాటు సంక్రాతిని  జరుపుతారు. ఇక 3వరోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు,

WEST BENGAL

డార్జిలింగ్
డార్జిలింగ్ లోని హిమాలయ ప్రాంతాలలో, ఈ పండుగను మాగీ సక్రతి అని పిలుస్తారు.  ఈరోజు ప్రజలు శివుని ఆరాధిస్తారు. సాంప్రదాయకంగా, ప్రజలు సూర్యోదయానికి ముందు స్నానం చేసి తర్వాత పూజను ప్రారంభిస్తారు. ఇక్కడ వండుకునే ఆహారపదార్ధం ప్రధానంగా తీపి బంగాళాదుంపలు మరియు యమ్ములతోచేస్తారు. మకరసంక్రాంతి తర్వాతిరోజు  లక్ష్మీ దేవి పూజ చేస్తారు. 

బీహార్ & జార్ఖండ్
బీహార్,జార్ఖండ్ లలో ఈ పండగను జనవరి 13,15 తేదీల్లో జరుపుకుంటారు. 14వ తేదీ మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.  దేశంలోని ఇతర ప్రాంతాలలో మాదిరిగానే ప్రజలు పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించి  రుచికరమైన  తీపి వంటకాలు చేస్తారు. ఉత్సాహంగా  గాలిపటాలు ఎగరేసి  ఆనంద డోలికల్లో మునిగిపోతారు.  జనవరి 15వ తేదీన ప్రత్యేకంగా కాలీఫ్లవర్, బఠానీలు, బంగాళాదుంపలు, పప్పు,బియ్యం తో కలిపిని ఆహార పదార్ధాలనుతయారు చేస్తారు. సాయంత్రం వేళ  ప్రత్యేక ఖిచిడీని తయారు చేసి పాపడ్, నెయ్యి, కూరగాయలతో చేసిన వంటకాన్ని ప్రజలంతా బంధువులు స్నేహితులతో కలిసి సామూహికంగా ఆరగిస్తారు. 

bihar jarkhand

కర్ణాటక
కర్ణాటక లో దీన్ని సుగ్గీలేదా పంటల  పండుగ గా పిలుస్తారు.  ఈరోజు మహిళలు ముఖ్యంగా నువ్వులు, బెల్లం. చెరుకు, కొబ్బరి , వేరుశనగ తో  చేసిన పిండి వంటలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు.  కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లో  కొత్తగా పెళ్లైన స్త్రీ  వివాహం చేసుకున్నమొదటి సంవత్సరంనుంచి 5 ఏళ్లపాటు సంక్రాంతిరోజు ముత్తయిదువలకు ్రటి పళ్లు వాయనంగా ఇవ్వటం ఆచారం. ఈ అరటి పళ్లు   ఏడాదికి  ఏడాది 5లెక్కన పెంచుకుంటూ వెళతారు.కొన్ని ప్రాంతాల్లో బెర్రీ పళ్ళు, యాలకులు ఇచ్చే సాంప్రదాయం కూడా ఉంది. ఇక గాలిపటాలు ఎగర వేయటం. ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దటం మరోక ముఖ్య మైన అంశం. గ్రామీణ ప్రాంతాల్లో పశువులను అందంగా అలంకరించి వాటికి పూజ చేస్తారు. గంగిరెద్దుల ఆటలు, ఎడ్ల పందాలు , బండలాగుటు పోటీలు వంటివి గ్రామీణ ప్రాంతాల్లోవిశేషంగా జరుపుకుంటారు. 

KARNATAKA

కేరళ
కేరళలో మకర సంక్రాంతి రోజు శబరిమల వద్ద పండుగ ఉత్సహాం ఎక్కువగా కనిపిస్తుంది.   శబరిమల కొండల్లో కనువిందు చేసే మకర జ్యోతి దర్శనం  కోసం దేశంలోని వివిధ ప్రాంతాలనుంచిఅయ్యప్ప భక్తులు శబరిమల కొండకు చేరుకుంటారు.

KERALA SANKRANTHI