New Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నేడు ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. ఖర్గేకు కాంగ్రెస్‌ ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఎన్నిక సర్టిఫికెట్ ను ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్ తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

New Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నేడు ప్రమాణ స్వీకారం

Mallikarjun Kharge

New Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. ఖర్గేకు కాంగ్రెస్‌ ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఎన్నిక సర్టిఫికెట్ ను ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్ తీసుకుని ఢిల్లీకి వెళ్లారు.

ఆయనతో పాటు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, మాజీ సీఎంలు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఇతర ఏఐసీసీ పదాధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారందరికీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ నుంచి ఆహ్వానం అందింది.

తాను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. కాగా, ఖర్గే 7,897 ఓట్లతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి తొలిసారి గాంధీ కుటుంబేతర నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శశి థరూర్ కు ఈ ఎన్నికలో 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే, మరో 416 ఓట్లు తిరసర్కరణకు గురయ్యాయి.

అనారోగ్య కారణాల రీత్యా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా పార్టీ నాయకులనుద్దేశించి మల్లిఖార్జున్ ఖర్గే ప్రసంగిస్తారు. 53 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఖర్గే సేవలు అందిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఖర్గే… 1969 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షడి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి పదవికి అంచెలంచెలుగా ఎదిగారు.

లోక్ సభ, రాజ్యసభ పక్షనేతగా,10 ఏళ్ళు కేంద్ర మంత్రిగా, 9 సార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన 1942 జులై 21న జన్మించారు. న్యాయవాదిగానూ ఆయన పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత అయిన ఖర్గేకు గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరుంది. 2014 ఎన్నికల్లో గుల్బర్గా స్థానం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఖర్గే గెలుపొందారు. 2019 లో గుల్బర్గా నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి జాదవ్ చేతిలో ఓడిపోయారు. 2020 జూన్ 12న కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

2021 ఫిబ్రవరి 12న ప్రతిపక్ష నేత, రాజ్యసభ నాయకుడిగా నియమితుడయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడంతో రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. స్వాతంత్ర్యానంతరం దక్షిణాది నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆరవ నేతగా గుర్తింపు పొందనున్నారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షులుగా బి.పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవ రెడ్డి, కె కామరాజ్, ఎస్ నిజలింగప్ప, పీవీ నరసింహారావు పనిచేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..