భగ్గుమన్న బెంగాల్ పాలిటిక్స్ : కదల్లేని స్థితిలో మమత, టీఎంసీ ఆందోళనలు

సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్‌ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవీకరించారు.

భగ్గుమన్న బెంగాల్ పాలిటిక్స్ : కదల్లేని స్థితిలో మమత, టీఎంసీ ఆందోళనలు

SSKM

Mamata Banerjee : ఓ వైపు నిరసనలు.. మరోవైపు ఈసీకి ఫిర్యాదులతో బెంగాల్‌ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ హాలివుడ్‌ థ్రిలర్‌ను తలపిస్తోంది. మమతపై దాడి విషయాన్ని ఈసీకీ స్వయంగా కలిసి వివరించేందుకు అటు అధికార టీఎంసీతో పాటు ఇటు బీజేపీ సిద్ధమయ్యాయి. రేపటిలోపు దాడి ఘటనపై సమగ్ర నివేదికి ఇవ్వాలని పశ్చిమబెంగాల్‌ సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయతోపాటు ప్రత్యేక పోలీసు పరిశీలకుడు వివేక్ దుబే, పశ్చిమ బెంగాల్ ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు అజయ్ నాయక్‌ను ఈ మేరకు ఆదేశించింది.

మరోవైపు సీఎం మమతపై బీజేపీనే దాడి చేసిందంటూ టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాడి వెనుక నందిగ్రామ్‌ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఉన్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. మమతపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రోడ్డుపై టైర్లు తగలపెట్టి నిరసన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ట్రైన్లు నిలిపివేశారు. ఇక సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్‌ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవీకరించారు. ఎంఆర్‌ఐ స్కానింగ్ తీశాక గాయాలను నిర్ధారించిన వైద్యులు… ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 48 గంటల పాటు పరిశీలనలో ఉంచుతామన్నారు. ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు, ఊపిరి పీల్చకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు దీదీ చెబుతున్నారని వైద్యులు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్‌ ఘటన… బెంగాల్‌ పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది. శివరాత్రి కావడంతో…ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న టీఎంసీ.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఇవాళ పార్టీ మేనిఫెస్టోను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రిలీజ్‌ చేయాల్సి ఉంది. అయితే.. నిన్న ఆమెపై దాడి జరగడం, ఆసుపత్రిలో వైద్య చికిత్స కొనసాగుతున్న తరుణంలో మేనిఫెస్టో విడుదల వాయిదాపడింది.