Lok Sabha elections-2024: కాంగ్రెస్ లేకుండా దేశంలో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని మమత, అఖిలేశ్ నిర్ణయం

బీజేపీ, కాంగ్రెస్ కి సమానదూరం పాటించాలని టీఎంసీ, ఎస్పీ నిర్ణయించాయి. ఈ మేరకు పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. వచ్చే వారం మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు. ఒకవైపు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెడుతున్న వేళ.. టీఎంసీ మాత్రం కాంగ్రెస్ ను దూరం పెట్టాలని ప్రణాళికలు వేసుకుంటోంది.

Lok Sabha elections-2024: కాంగ్రెస్ లేకుండా దేశంలో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని మమత, అఖిలేశ్ నిర్ణయం

Lok Sabha elections-2024

Lok Sabha elections-2024: కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూనే తృణమూల్ కాంగ్రెస్ విపక్షాల కూటమిని ఏర్పాటు చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ లేకుండానే టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీలు కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కి సమానదూరం పాటించాలని నిర్ణయించాయి.

ఈ మేరకు పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. వచ్చే వారం మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు. ఒకవైపు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెడుతున్న వేళ.. టీఎంసీ మాత్రం కాంగ్రెస్ ను దూరం పెట్టాలని ప్రణాళికలు వేసుకుంటోంది.

బీజేపీ కాంగ్రెస్ దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అనుకున్నదాని కంటే తక్కువ రాణించడంతో మమతా బెనర్జీ పునరాలోచనలో పడడమే ఇందుకు కారణం.

బెంగాల్లోని సాగర్దిగి నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బైరాన్ బిశ్వాస్ విజయం సాధించారు. దీంతో, ఆ వెంటనే 2024 ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీచేస్తుందని మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కి సమాన దూరాన్ని పాటిస్తూ కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తాము ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని టీఎంసీ తెలిపింది.

Bengaluru: పగలు డ్రైవర్.. రాత్రి ఫైనాన్షియల్ అడ్వైజర్.. నెట్టింట ఆసక్తిరేపుతున్న ఆటో డ్రైవర్ స్టోరి