Mamata Banerjee : దీదీకి షాక్, ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

తృణముల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడం సంచలనం రేకేత్తిస్తోంది. ఒక రోజు ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని సూచించింది.

Mamata Banerjee : దీదీకి షాక్, ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

Wb Ec

West Bengal Election Campaigning : పశ్చిమ బెంగాల్ ఎన్నికల పొలిటిక్స్ తారాస్థాయికి చేరుకొంటోంది. టీఎంసీ, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. తృణముల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడం సంచలనం రేకేత్తిస్తోంది. ఒక రోజు ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని సూచించింది. 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం రాత్రి 8 గంటల నుంచి 24 గంటల పాటు ప్రచారం చేయవద్దని స్పష్టంగా వెల్లడించింది. మత ప్రాతిపదికన మమత బెనర్జీ ఓట్లు అడుగుతున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీంతో పై విధంగా చర్యలు తీసుకొంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా…ఏప్రిల్ 03వ తేదీ హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ ప్రాంతంలో మమత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వర్గాన్ని దీదీ ప్రస్తావించారని, మైనార్టీ ఓట్లను విభజించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆధ్వర్యంలో బీజేపీ బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ స్పందించింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని మమతకు నోటీసులు జారీ చేసింది.

దీనిపై ఎన్నికల సంఘానికి మమత వివరణ ఇచ్చారు. పరీశీలించిన అనంతరం చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని దీదీకి ఈసీ సూచించింది.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మొత్తం 135 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇంకా 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 17వ తేదీన ఐదో దశలో 44 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది.