ఓటు వేసిన మమతాబెనర్జీ

ఓటు వేసిన మమతాబెనర్జీ

Mamata Banerjee Casts Vote In Bhabanipur

Mamata Banerjee casts vote in Bhabanipur వెస్ట్ బెంగాల్ లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగుతోంది. ఏడో దశలో భాగంగా ఇవాళ 34 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దక్షిణ కోల్‌కతాలోని భవానిపూర్ లోని మిత్రా ఇన్సిస్టిట్యూషన్ స్కూల్ లోని పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నాం 3:50గంటల సమయంలో మమత తన ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తూ విజయ సంకేతం చూపించారు. ఇవాళ ఉదయం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఇదే పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా, భవానిపూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మమతాబెనర్జీ ఈ సారి నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. భవానీపూర్ లో ఈసారి సీనియర్ లీడర్ సమనాథ్ ఛటోపాధ్యాయ్ ని బరిలోకి దింపింది టీఎంసీ. ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 2న ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.