ఇంత చెత్త ఎన్నికలు జీవితంలో చూడలేదు..ఈసీపై మమత ఫైర్

పశ్చిమ బెంగాల్‌‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు.

ఇంత చెత్త ఎన్నికలు జీవితంలో చూడలేదు..ఈసీపై మమత ఫైర్

Mamata Banerjee Cries Cheating In Nandigram Raises Question Over Ecs Silence

Mamata Banerjee పశ్చిమ బెంగాల్‌‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు. తన జీవితంలో ఇంత చెత్త ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు. గురువారం రెండో దశలో భాగంగా పోలింగ్ జరుగుతున్న నందిగ్రామ్‌లో నెలకొన్న పరిస్థితుల అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మమతా బెనర్జీ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో విజయం మనదే. అందుకే నేను మీకు విజయ చిహ్నం ‘వీ’ చూపిస్తున్నాను. అంతేకాదు, ఎన్నికల సంఘానికి, అమిత్ షాకు నేను క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి మీ గూండాలను అదుపులో పెట్టుకోండి. వారు మహిళా జర్నలిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాను. వారిని దుర్భషలాడుతున్నారు. గవర్నర్‌తో నేనేం మాట్లాడనో భయటపెట్టను. ఇది చాలా గోప్యంగా ఉంటుంది అని అన్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల సరళిపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చెత్త ఎన్నికలను తన జీవితంలో చూడలేదు అని మమత అన్నారు.

బీజేపీకి,వాళ్ల గుండాలకు మాత్రమే సహాయం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ మరియు ఇతర జవాన్లకు ఆదేశిస్తున్నారని మమత ఆరోపించారు. మౌనంగా ఉంటున్నందుకు ఎన్నికల సంఘానికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. తాము ఎన్నికల సంఘానికి ఇప్పటికే 63 ఫిర్యాదులు చేశామని.. కానీ వారు ఏకపక్షంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారన్నారు. తాను నందిగ్రామ్ గురించి భాదపడటం లేదని.. ప్రజాస్వామ్యం గురించి ఆందోళన చెందుతున్నానన్నారు. కేంద్రబలగాలను ఉపయోగించి బీజేపీ ఓటింగ్ ను ప్రభావితం చేస్తోందన్నారు. “మా మట్టి మనుష్” ఆశీర్వాదంతో నందిగ్రామ్ లో విజయం సాధిస్తానని మమత ధీమా వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోలింగ్ జరిగే ప్రతిసారి బెంగాల్ ఎందుకొస్తున్నారని మమత ప్రశ్నించారు. ఎలక్షన్ రోజున మోడీ ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే ఏరియాల్లో తాము ప్రచారం చేయకూడదని ఆంక్షలు విధించి..మోడీ మాత్రం దూరదర్శన్ తో సహా అన్ని సౌకర్యాలతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొంటున్నారని..ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఉల్లంఘన కాదా అని మమత ప్రశ్నించారు.

ఇవాళ మధ్యాహ్నాం ఎన్నికలు జరుగుతున్న నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ బూత్‌ను సీఎం మమతా బెనర్జీ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నర్ జగదీప్ ధనకర్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. సామాన్య ప్రజానీకాన్ని పోలింగ్ బూత్‌లోకి రానివ్వడం లేదు… ఓటు హక్కును వినియోగించుకోనివ్వడం లేదు.. ఉదయం నుంచి నేను ప్రచార పర్వంలో ఉన్నాను. దయచేసి ఈ సమస్యపై దృష్టి సారించండి అంటూ సీఎం మమత ఫోన్‌లో గవర్నర్‌ను కోరారు. యూపీ, బీహార్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్ బూత్‌ ముందు నానా హంగామా సృష్టిస్తున్నారని దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా హంగామా సృష్టించడానికే వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చారని ఆరోపించారు. నందిగ్రామ్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 7 లోకి ప్రజలెవ్వర్నీ సీఆర్పీఎఫ్ జవాన్లు రానివ్వడం లేదని మమత ఆరోపించారు.