Bhawanipur : మమత బెనర్జీకి సొంత ఇల్లు, వాహనం లేదట..!

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ శనివారం భవానీపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాల్లో తనకు సొంత ఇల్లు, వాహనం లేదని పేర్కొన్నారు.

Bhawanipur : మమత బెనర్జీకి సొంత ఇల్లు, వాహనం లేదట..!

Bhawanipur

Bhawanipur : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నెల 30 తేదీన ఇక్కడ ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మమత శనివారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ పత్రాల్లో ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. సొంత ఇల్లు, సొంత వాహనం లేదని నామినేషన్ ప్రమాణ పత్రాల్లో పేర్కొన్నారు మమత.

Read More : Mamata Banerjee : భవానీపుర్‌ ఉపఎన్నికల బరిలో మమతా బెనర్జీ

ఇక 2019-20తో పోల్చితే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మమత ఆదాయం రూ.5 లక్షలు పెరిగింది. 2016తో పోల్చితే మమత స్థిర, చర ఆస్తుల విలువ తగ్గినట్లు పేర్కొంది. 2019-20లో మమత ఆదాయం రూ.10,34,370 ఉండగా.. 2020-21లో రూ.16,47,845కు పెరిగింది. 2016 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రాల్లో మమత ఆదాయం రూ.8,18,300గా ఉంది. 2018-2019లో గణనీయంగా రూ.20,71,010కి పెరిగింది.

ప్రస్తుతం మమత బెనర్జీ బ్యాంక్​ బ్యాలెన్స్​ రూ.13,11,512గా ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. నందిగ్రామ్ ఎన్నికల సమయంలో మమత బ్యాంక్ బ్యాలెన్స్ 13,53,000గా చూపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ రూ.27,61,000గా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద రూ.69,255 నగదు ఉన్నట్లుగా మమత.. ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు.

Read More : Mamata Banerjee : భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి మమత నామినేషన్

2016 ఎన్నికల సమంయలో మమతా బెనర్జీ వద్ద రూ.30,75,000 విలువ చేసే ఆస్తులు ఉండగా.. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తన వద్ద రూ.16,72,352.11 విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రసుతం తన ఆస్తుల విలువ రూ.15,38,029గా ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న మమతా బెనర్జీ. వీటితోపాటు 9.7 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.