Mamata banerjee: మోదీని కలవనున్న మమత.. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసమేనా?

విపక్షాలు మార్గరెట్ అల్వా(Margaret Alva)ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్‭గా పని చేసిన జగ్‭దీప్ ధన్‭కర్‭(Jagdeep Dhankhar)ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Mamata banerjee: మోదీని కలవనున్న మమత.. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసమేనా?

Mamata banerjee: ప్రధానమంత్రి నరేంద్రమోదీని (Prime Minister Narendra Modi) పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు సాయంత్రం కలుసుకోనున్నట్లు సమాచారం. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లనున్న ఆమె ఉపరాష్ట్రపతి ఎన్నిక(vice presidential election)కు రెండు రోజుల ముందు మోదీని కలుసుకోనుండడం విశేషం. ఆదివారం నీతి అయోగ్(NITI Aayog) సమావేశంలో పాల్గొననున్న దీదీ.. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగే శనివారం రోజున ఢిల్లీలోనే ఉండనున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు పోటీగా టీఎంసీ నుంచి యశ్వంత్ సిన్హాను పోటీకి దింపిన మమతా బెనర్జీ తాజా ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము పాల్గొనడం లేదంటూ ప్రకటించారు.

విపక్షాలు మార్గరెట్ అల్వా(Margaret Alva)ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్‭గా పని చేసిన జగ్‭దీప్ ధన్‭కర్‭(Jagdeep Dhankhar)ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గవర్నర్ ధన్‭కర్‭, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య పెద్ద ఎత్తున బేధాభిప్రాయాలు ఉండేవి. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితులే ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం సరిగా పని చేయడం లేదంటూ కేంద్రానికి ధన్‭కర్‭ ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తుండేవారు. అలాగే ధన్‭కర్‭ను ఉపయోగించి తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ బీజేపీపై మమతా విరుచుకుపడేవారు.

అయితే వీరి మధ్య ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ మమతా మద్దతును ధన్‭కర్ కోరినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం డార్జిలింగ్‭లో వీరిద్దిరూ సమావేశమయ్యారు. ఆ సమావేశానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే టీఎంసీ నుంచి మద్దతు కావాలని ధన్‭కర్ అడిగినట్లు తెలుస్తోంది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ ఎంపీలు సముఖంగా లేరట. అయితే దీనిని తనకు అనుకూలంగా తీసుకోవాలని ధన్‭కర్ భావిస్తున్నప్పటికీ ఈ ఎన్నికలో పాల్గొనమని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది. ఇదే సమయంలో ప్రధాని మోదీని మమత బెనర్జీ కలవబోతుండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశం వస్తుందా? వస్తే దీదీ మద్దతును మోదీ అడుగుతారా? ఒకవేళ అడిగితే ఆమె ఏ విధంగా స్పందిస్తారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Eknath Shinde: ఉత్కంఠ వీడింది.. మంత్రివర్గ విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్