Farmer Leaders : దీదీని కలిసిన రైతు నేతలు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్​ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్​ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.

Farmer Leaders : దీదీని కలిసిన రైతు నేతలు

Farmer Leaders

Farmer Leaders సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్​ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్​ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కోల్ కతాలో జరిగిన ఈ సమావేశంలో రాకేశ్​ టికాయిత్, యుధ్​వీర్​ సింగ్​ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, స్థానిక కార్మికుల అంశాలపై ఆమెతో చర్చించారు. బెంగాల్ లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలని మమతకు రైతు నేతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా రైతుల ఉద్యమానికి మద్దతు కొనసాగిస్తామని రైతు నేతలకు దీదీ భరోసా ఇచ్చారు. రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల్లో న్యాయం ఉందని మమత పేర్కొన్నారు. తాము వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించామని…రైతుల డిమాండ్లు నెరవేరే వరకు వారి ఉద్యమానికి మద్దుతగా నిలబడతామన్నారు. గ‌త ఏడు నెల‌లుగా కేంద్రం రైతుల‌తో మాట్లాడ‌టానికి బాధ‌ప‌డ‌టం లేద‌ని, కేంద్రం వెంట‌నే త‌మ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాలని మ‌మ‌త డిమాండ్ చేశారు.

దీదీతో సమావేశం అనంతరం రాకేష్ తికాయిత్ డియాతో మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి మద్దతు కొనసాగిస్తామని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారని, ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. పశ్చిమబెంగాల్ మోడల్ స్టేట్‌గా నిలవాలని, రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.