అమిత్ షా తో మమతా భేటీ: కారణం ఇదే

  • Edited By: vamsi , September 19, 2019 / 09:03 AM IST
అమిత్ షా తో మమతా భేటీ: కారణం ఇదే

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. సమయం దొరికినప్పుడు బీజేపీపై విరుచుకుపడే ఆమె ప్రధాని మోడీతో ఢిల్లీలో బుధవారం(18 సెప్టెంబర్ 2019) భేటీ అయ్యారు. అనంతరం ఆమె ఇవాళ(20 సెప్టెంబర్ 2019) హోంమంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. మధ్యాహ్నం హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న ఆమె అమిత్ షాతో కాసేపు చర్చించారు.

పశ్చిమ బెంగాల్ పేరు మార్పు అంశమే ప్రధాన ఎంజెడాగా షాతో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఒక్క రోజు వ్యవధిలోనే ప్రధాని, హోంమంత్రితో మమతా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండే ఆమె.. బీజేపీ ముఖ్య నేతలతో భఏటి అవ్వడం ఆసక్తకిర చర్చకు దారి తీసింది. ఆమె భేటీ వెనక మాత్రం ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి.

ఎన్ఆర్సీ(1National Register of Citizens) కిందకు 19 లక్షల మంది రాలేదని, వాళ్లలో చాలామంది హిందీ మాట్లాడేవారు, బెంగాలీ మాట్లాడేవారు మరియు స్థానిక అస్సామీలు ఉన్నారని, ఈ విషయాన్ని పరిశీలించాలంటూ ఓ లేఖను మమతా బెనర్జీ సమర్పించారు.