రాజ్యాంగ పరిరక్షణ..ధర్నాకు దిగిన మమత

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2019 / 04:40 PM IST
రాజ్యాంగ పరిరక్షణ..ధర్నాకు దిగిన మమత

కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర సీఎం మమతాబెనర్జీ ధర్నాకు దిగారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె ధర్నాకు దిగారు. సీపీ రాజీవ్ కుమార్ కూడా దీక్షలో పాల్గొన్నారు.

శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి కోల్ కతా  పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని విచారించేందుకు కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం సాయంత్రం చేరుకున్న సీబీఐ అధికారుల బృందాన్ని గేటు బయటే బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు షకేస్పరీ సరనీ పోలీస్ స్టేషన్ కి తరలించారు. 

సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మమత..ఎటువంటి నోటీసు లేకుండా సీబీఐ అధికారులు సీపీ ఇంటికి వచ్చారని, తాము సీబీఐ అధికారులను అరెస్ట్ చేసి ఉండవచ్చు కానీ తాము వారిని వదిలేశామని తెలిపారు. ఈ రోజు సీపీ ఇంటి దగ్గర జరిగిన దానికి తాను చాలా భాధపడుతున్నానని మమత తెలిపారు.సీపీని అనవసరంగా కేసులోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రపంచంలో సీపీ రాజీవ్ బెస్ట్ అని తాను ఇప్పటికీ చెబుతానని సీపీని కలిసిన తర్వాత మమత అన్నారు. కేంద్రదర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు. సేవ్ కాన్ స్టిట్యూషన్ పేరుతో ధర్నాకు దిగారు.ఈ ధర్నా అర్థం సత్యాగ్రహ అని ఆమె తెలిపారు.

అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులను వదిలిపెట్టిన తర్వాత  జాయింట్ కమిషనర్(క్రైమ్) ప్రవీణ్ త్రిపాఠి  మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ పేరుతో ఎటువంటి పేపర్లు లేకుండా సీపీ ఇంటి దగ్గరకు వచ్చారని తెలిపారు. ఆపరేషన్ దేని గురించి అని తాము అడిగినప్పుడు వారు సరైన సమాధానం చెప్పలేకపోయినట్లు త్రిపాఠి తెలిపారు.