Mamata Banerjee CM : ముచ్చటగా మూడోసారి.. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమబెంగాల్‌ సీఎంగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ మమతాతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. మమతా బెనర్జీ తన ట్రేడ్ మార్క్ వైట్ శారీ, శాలువలో బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేశారు.

Mamata Banerjee CM : ముచ్చటగా మూడోసారి.. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

Mamata Banerjee Swearing In Ceremony

Mamata Banerjee swearing-in ceremony : తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమబెంగాల్‌ సీఎంగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ మమతాతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. మమతా బెనర్జీ తన ట్రేడ్ మార్క్ వైట్ శారీ, శాలువలో బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేశారు. బెనిర్జీ తన మొదటి ప్రాధాన్యత కోవిడ్‌ను ఎదుర్కోవడమేనని, శాంతిని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 292 స్థానాలకు గాను ఏకంగా 213 చోట్ల తృణమూల్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ 77 స్థానాలకే పరిమితమైంది. దీంతో మూడోసారి తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.


కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మమతా ప్రమాణ స్వీకారోత్సవానికి కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. బుధవారం మమతా మాత్రమే సీఎంగా ప్రమాణం చేయగా.. రేపు, ఎల్లుండి తృణమూల్ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది.