Mamata Banerjee : భవానీపూర్ నుంచే మమత పోటీ..టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా!

పశ్చిమ బెంగాల్ వ్యవసాయశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ సీనియర్ నేత సోభన్​దేవ్​ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

Mamata Banerjee :  భవానీపూర్ నుంచే మమత పోటీ..టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా!

Mamata Banerjee To Contest From Bhabanipur Seat In Kolkata Sitting Tmc Mla To Resign

Mamata Banerjee పశ్చిమ బెంగాల్ వ్యవసాయశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ సీనియర్ నేత సోభన్​దేవ్​ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో..కోల్​కతా జిల్లాలోని భవానీపుర్​ నియోజకవర్గం నుంచి సోభన్​దేవ్​ చటోపాధ్యాయ 28 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

వాస్తవానికి భవానీపుర్​ మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం. ఎన్నికల ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె ఆ స్థానాన్ని వీడి… నందిగ్రామ్​ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 1956 ఓట్ల తేడాతో మమత ఓడిపోయారు. అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమత…రూల్ ప్రకారం 6 నెలల్లోగా శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేనందున ఆయన ఆరు నెలల్లోగా ఖచ్చితంగా శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది.

దీంతో మమత పోటీ చేసేందుకు వీలుగా భవానీపుర్​ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి చటోపాధ్యాయ రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం మమతా బెనర్జీ 2011ఉప ఎన్నికల్లో మరియు 2016అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా,ఇప్పుడు మరోసారి భవానీపూర్ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.