మమతాను ఒంటరి చేసేందుకు రెబల్స్‌కు వెల్‌కమ్ చెప్తోన్న అమిత్ షా

మమతాను ఒంటరి చేసేందుకు రెబల్స్‌కు వెల్‌కమ్ చెప్తోన్న అమిత్ షా

Mamata Banerjee: కేంద్ర మంత్రి అమిత్ షా హై ప్రొఫైల్ ఉన్న తృణముల్ కాంగ్రెస్ రెబల్ సువేందు అధికారితో పాటు పలువురికి బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నారు. పశ్చిమబెంగాల్ లోని పశ్చిమ్ మెదినిపూర్ లో నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్న ఆయన మమతా బెనర్జీకి గట్టి షాక్ తగలనుందని చెబుతున్నారు.

‘తృణముల్ కాంగ్రెస్ ను ఎందుకని చాలా మంది వదిలేసుకుంటున్నారు. మమతా.. తప్పుడు పాలన, అవినీతి, స్వాభిమానంతో నేతలు విసిగిపోతున్నారు. దీదీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎన్నికల సమయానికి నువ్వు ఒంటరిగా మిగిలిపోవడం ఖాయం’ అని అమిత్ షా అన్నారు.

పలు పార్టీల నుంచి మిస్టర్ అధికారితో పాటు మరో 9మంది ఎమ్మెల్యేలు, తృణముల్ ఎంపీ సునీల్ మోండాల్ .. అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని.. వెస్ట్ బెంగాల్ లో 294సీట్లు ఉన్న అసెంబ్లీలో 200కు పైగా సీట్లు కొల్లగొట్టడం ఖాయమని చెప్పుకొచ్చారు.

షాతో పాటు అధికారి కూడా గొంతు కలిపి మమతా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎదుగుదల కోసం.. పార్టీని పణంగా పెడుతుందంటూ ఆరోపించారు. దాంతో పాటు మేనల్లుడిని తొలగించండి అంటూ నినాదం కూడా చేశారు.

నాకు అమిత్ షాతో చాలా కాలంగా పరిచయం ఉంది. బీజేపీలో ఉన్న ఆయణ్ను బ్రదర్ లా ఫీల్ అవుతా. కొవిడ్ 19కు గురైనప్పుడు టీఎంసీ నుంచి వచ్చి ఎవరూ పలకరించలేదు. కానీ, అమిత్ షా రెండు సార్లు వచ్చారని అధికారి చెప్పారు.

బెంగాల్‌ను 3 ద‌శాబ్దాల‌పాటు కాంగ్రెస్ చేతిలో పెట్టారు. ఆ త‌ర్వాత 27 ఏళ్లు క‌మ్యూనిస్టుల‌కు అప్పగించారు. ప‌దేళ్లుగా మ‌మ‌తా దీదీకి అధికారం అప్పగించారు. అధికారంలో ఎవ‌రున్నా రాష్ట్రం త‌ల‌రాత మార‌లేదు. కానీ, ఒక్క ఐదేళ్లు బెంగాల్‌లో అధికారాన్ని బీజేపీకి ఇవ్వండి. రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌లా మార్చి చూపిస్తామని ఓటర్లకు అమిత్ షా చెప్పారు.