మమత సంచలన ప్రకటన…నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా

మమత సంచలన ప్రకటన…నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా

Mamata Banerjee వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సోమవారం(జనవరి-18,2021)దీదీ ప్రకటించారు. ఈ ప్రకటన చాలా ముఖ్యమైనది ఎందుకంటే..టీఎంసీలో నె0.2గా కొనసాగి గత నెలలో బీజేపీలోకి జంప్ అయిన మాజీ మంత్రి సువెందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమిది కావడమే.

నందిగ్రామ్ లో నిర్వహించిన ఓ బహిరంగసభలో మమత మాట్లాడుతూ.. నందిగ్రామ్ ని పోటీ చేయబోతున్నా. నందిగ్రామ్ నా లక్కీ ఫ్లేస్. కోల్ కతాలోని భభిన్ పూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తా అన మమత తెలిపారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. కాగా,నందిగ్రామ్ మమతకి చాలా కలిసొచ్చిన ప్రాంతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నందిగ్రామ్ లో రైతుల భూముల విషయంలో మమత పోరాటమే 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కమ్యూనిస్ట్ పార్టీని గద్దె దించి మమతకి భారీ విజయాన్ని అందించింది.

2007లో కమ్యూనిస్ట్ ఫ్రభుత్వం నందిగ్రామ్ లో అనుమచ్చిన SEZ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో 14మంది ఆందోళనకారులు చంపబడ్డారు. ఈ ఘటన తర్వాత మమతా బెనర్జీ,ఆమె తృణముల్ కాంగ్రెస్ ఈ ఘటననే ప్రధాన అస్త్రంగా “మా మట్టి మనుష్” క్యాంపెయిన్ నిర్వహించింది రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. మరోవైపు, 2007 సమయంలో మమతకి సన్నిహితంగా ఉన్నవాళ్లలో సువెందు అధికారి ముఖ్యమైన వ్యక్తి. ఆ సమయంలో నందిగ్రామ్​లో ఆందోళనలను సువేందు అధికారి ముందుండి నడిపించారు. 2011లో నందిగ్రామ్ లో లెఫ్ట్ ని ఓడగొట్టి సువెందు తృణముల్ తరపున విజయం సాధించారు.

అప్పటినుంచి ఇప్పటిదాకా తృణముల్ కంచుకోటగా నందిగ్రామ్ ఉంది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మమత నందిగ్రామ్ వైపు ప్రత్యేక ఫోకస్ పెట్టడం సువెందు అధికారి ప్రత్యక్ష సవాల్ లాంటిదే. గత నెలలో తనతో పాటు అనేకమంది ఎమ్మెల్యేలు,తృణముల్ నాయకులను బీజేపీలోకి తీసుకెళ్లిన సువెందుకి మమత నిర్ణయంతో పెద్ద షాక్ తగిలినట్టే అని చెప్పనక్కర్లేదు.