Mamata Banerjee: బంపర్ మెజారిటీతో గెలిచిన మమతా బెనర్జీ

పశ్చిమ్ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప-ఎన్నిక ఫలితాల్లో మమతా బెనర్జీ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. 58వేల 389 ఓట్లతో గెలిచి ప్రత్యర్థులకు పరాభవం చవిచూపారు.

Mamata Banerjee: బంపర్ మెజారిటీతో గెలిచిన మమతా బెనర్జీ

Mamata

Mamata Banerjee: పశ్చిమ్ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప-ఎన్నిక ఫలితాల్లో మమతా బెనర్జీ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. 58వేల 389 ఓట్లతో గెలిచి ప్రత్యర్థులకు పరాభవం చవిచూపారు. 2021 మార్చి- ఏప్రిల్‌ మధ్య జరిగిన పశ్చిమ్ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ మెజారిటీతో విజయం సాధించింది.

ఆ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓటమి చవిచూసిన మమతా మళ్లీ పోటీ చేయకతప్పలేదు. భవానీపూర్‌లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన కౌంటింగ్ మమతాకు గుడ్ న్యూస్ వినిపించింది. మొత్తం 21 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు.

…………………………………………………………: మా ఉద్దేశం అది కాదు.. జగన్‌ను బెదిరించేవాళ్లు ఇంకా పుట్టలేదు..!

సెప్టెంబరు 30న జరిగిన పోలింగ్‌లో 57 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. ఎవరు గెలిచినప్పటికీ గెలుపు సంబరాలు వంటివి చేసుకోవద్దని ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రాకేశ్ కుమార్ ఆదివారం ఉదయం సర్కూలర్ జారీ చేశారు. గతంలో భవానీపూర్ నుంచి మమతా 2011, 2016 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.