మమత హ్యాట్రిక్‌ సాధించే అవకాశాలే ఎక్కువ..ఒపీనియన్ పోల్

మమత హ్యాట్రిక్‌ సాధించే అవకాశాలే ఎక్కువ..ఒపీనియన్ పోల్

Mamata hat-trick మరో రెండు నెలల్లో జరుగనున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలన్నీ పన్నుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉన్న పేరొందిన నాయకులకు కూడా ఎర వేస్తోంది. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలను తనవైపుకు తిప్పుకుంది బీజేపీ

అయితే ఇంత చేస్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం మాత్రం కష్టమేనంటున్నాయి సర్వేలు. మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమంటున్నాయి సర్వేలు. సీఎన్‌ఎక్స్‌, ఏబీపీ ఆనంద (ప్రైవేటు సంస్థలు) నిర్వహించిన పబ్లిక్‌ ఒపినియన్‌‌ సర్వేలు..తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధించి తీరుతుందని అంటున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 146 నుంచి 156 స్థానాల్లో గెలుస్తుందని, మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని తేల్చేస్తున్నాయి.

అయితే బీజేపీ మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుందని, కమలం పార్టీకి 113-121 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మేజిక్‌ ఫిగర్‌ 148 స్థానాలకు అటు ఇటుగా తృణమూల్‌ గెలిచినా పెద్దగా ఇబ్బంది ఉండదని, ఎందుకంటే కాంగ్రెస్‌-వామపక్షాల నేతృత్వంలోని కూటమి సపోర్ట్‌తో మమతా అధికారంలో రావచ్చని పబ్లిక్‌ ఓపినియన్‌ సర్వేలు అంటున్నాయి. కాంగ్రెస్‌- వామపక్షాల కూటమికి 20-28 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేల్చాయి.