TMC మేనిఫెస్టో రిలీజ్..ఏటా 5లక్షల ఉద్యోగాలు,విద్యార్థులకు రూ.10లక్షల లిమిట్ తో క్రెడిట్ కార్డు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్ కతాలో సీఎం మమతాబెనర్జీ..టీఎంసీ మేనిసెస్టోని విడుదల చేశారు.

TMC మేనిఫెస్టో రిలీజ్..ఏటా 5లక్షల ఉద్యోగాలు,విద్యార్థులకు రూ.10లక్షల లిమిట్ తో క్రెడిట్ కార్డు

Tmc’s Poll Manifesto

TMC’s poll manifesto పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్ కతాలో సీఎం మమతాబెనర్జీ..టీఎంసీ మేనిసెస్టోని విడుదల చేశారు. ఇది పొలిటికల్ మేనిఫెస్టో కాదని..ఇది అభివృద్ధి-ఆధారిత మేనిఫెస్టో అని మమత తెలిపారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని సీఎం తెలిపారు.

తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే..నిరుద్యోగాన్ని తగ్గించి ఏటా 5లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మమతాబెనర్జీ వాగ్దానం చేశారు. చిన్న,మధ్యతరగతి రైతులకు ఇచ్చే సాయాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని మమతాబెనర్జీ తెలిపారు. ఉన్నతవిద్య చదివే విద్యార్ధులకు రూ.10లక్షల లిమిట్ తో ఓ క్రెడిట్ కార్డుని అందిస్తామని,దానికి కేవలం 4శాతం వడ్డీ మాత్రమే ఛార్జ్ చేయనున్నట్లు మమత తెలిపారు. పేదల కోసం గ్యారెంటీడ్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పథకం కింద..వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ఏటా రూ.12వేలు,జనరల్ క్యాస్ట్ లబ్దిదారులకు ఏటా రూ.6వేలు, డోర్-టూ-డోర్(ఇంటివద్దకే)రేషన్ డెలివరీ,రైతులకు అందించే సాయాన్ని పెంచుతామని టీఎంసీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.

కోల్ కతాలో మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ..మేం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మేము ఇచ్చిన వాగ్దానాలను 100శాతం అమలు చేశామని మీ అందరికీ తెలుసు. మేం చేసిన పనికి ఇప్పటికే ప్రపంచం ప్రశంసించింది. యునైటెడ్ నేషన్స్(UN)నుంచి మాకు అవార్డులు వచ్చాయి. 100రోజుల పని కల్పనలో మేము నెం.1గా నిలిచాం. పేదరికాన్నా 40శాతం తగ్గించాం. రైతుల ఆదాయాన్ని మూడు రెటలు పెంచాం. ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే బెంగాల్ లో రైతుల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని మమతాబెనర్జీ తెలిపారు.