Mamata RSS: ఆర్ఎస్ఎస్‭కు మద్దతుగా దీదీ వ్యాఖ్యలు.. విరుచుకుపడుతున్న విపక్షాలు

కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు దీదీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘2003లో ఆర్ఎస్ఎస్‭ను దేశభక్తులుగా కీర్తించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆమెను దుర్గగా అభివర్ణించింది. ఆర్ఎస్ఎస్ హిందూరాష్ట్రాన్ని కోరుకుంటోంది. వారి చరిత్రంగా ముస్లిం వ్యతిరేకతతో నిండి ఉన్నదే

Mamata RSS: ఆర్ఎస్ఎస్‭కు మద్దతుగా దీదీ వ్యాఖ్యలు.. విరుచుకుపడుతున్న విపక్షాలు

Mamata RSS not that bad remark prompts sharp jibe from opposition

Mamata RSS: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‭ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆర్ఎస్ఎస్ గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందని, తన ఉద్దేశంలో ఆర్ఎస్ఎస్‭ అంత చెడు సంస్థేమీ కాదంటూ దీదీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండపడుతున్నాయి. దీదీ అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

వాస్తవానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే ఒంటికాలిపై లేచే దీదీ ఈ మధ్య అంతగా విమర్శలు చేయడం లేదు. కొద్ది రోజులుగా టీఎంసీ నేతలు టార్గెట్‭గా ఈడీ, సీబీఐలు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీదీ మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‭కు మద్దతుగా దీదీ వ్యాఖ్యానించడం విమర్శలకు మరింత ఊతం ఇచ్చింది.

అసలు దీదీ ఏమన్నారంటే.. ‘‘ఇంతకు ముందంత చెడ్డగా అయితే ఆర్ఎస్ఎస్ లేదు. నా దృష్టిలో ఆర్ఎస్ఎస్ చెడ్డ సంస్థ ఏమీ కాదు. ఈరోజుకి కూడా ఆర్ఎస్ఎస్‭లో ఎంతోమంది మంచి వ్యక్తులు, నిజాయితీ కలిగిన వారు ఉన్నారు. వారు బీజేపీకి మద్దతు ఇవ్వరు. కొన్ని కారణాల వల్ల వారు బయటికి మాట్లాడలేకపోతున్నారు. కానీ ఏదో ఒకరోజు వారి మౌనం బద్ధలై బయటికి వస్తుంది’’ అని అన్నారు.

WhatsApp: ఒక్క నెలలోనే 23 లక్షల అకౌంట్లు బ్లాక్ చేసిన వాట్సాప్.. ఎందుకో తెలుసా?

అంతే.. కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు దీదీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘2003లో ఆర్ఎస్ఎస్‭ను దేశభక్తులుగా కీర్తించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆమెను దుర్గగా అభివర్ణించింది. ఆర్ఎస్ఎస్ హిందూరాష్ట్రాన్ని కోరుకుంటోంది. వారి చరిత్రంగా ముస్లిం వ్యతిరేకతతో నిండి ఉన్నదే. గుజరాత్ హత్యాకాండపై బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా దీదీ వెనకేసుకొచ్చారు. టీఎంసీలో ఉన్న ముస్లింలు ఆమె నిజాయితీని స్థిరత్వాన్ని ఇంకా పొగుడుతూనే ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ స్పందస్తూ ‘‘కొన్నిసార్లు ఆమె హిందూ ఛాందసవాదులను కొన్నిసార్లు ముస్లింలను ఎన్నికల డివిడెండ్‌లను ఆమె భావిస్తోంది. మమతా బెనర్జీ అసలు రూపం బట్టబయలైంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని టీఎంసీ చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని నిరూపితమయ్యాయి’’ సీపీఎం విమర్శించింది.

Kejriwal Vs Modi: సిసోడియాను రెండు సార్లు అరెస్ట్ చేస్తే మేమే గెలుస్తాం.. బీజేపీతో కేజ్రీవాల్