TMC: విజయఢంకా మోగించిన దీదీ.. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

బెంగాల్ లో మమతా బెనర్జీ మరోసారి తిరుగులేని అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మమతా తృణమూల్ కాంగ్రెస్ (TMC) విజయఢంకా మోగించి..

TMC: విజయఢంకా మోగించిన దీదీ.. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

Tmc

TMC: బెంగాల్ లో మమతా బెనర్జీ మరోసారి తిరుగులేని అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మమతా తృణమూల్ కాంగ్రెస్ (TMC) విజయఢంకా మోగించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే, ఆ ఎన్నికలలో మమతా ఓడిపోయారు. అయితే, ఆమె పార్టీ టీఎంసీ భారీ మెజార్టీతో గెలిపించుకోవడంతో మరోసారి ఆమె పాలన పగ్గాలు చేపట్టారు. ఇక తాజాగా భవానీపుర్ ఉపఎన్నికలో పోటీచేసిన మమతా విజయ ఢంకా మోగించారు.

తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. ఇందుకోసం ఇక్కడ భారీ నగదు ప్రవాహం జరిగిందని కూడా అనధికారికంగా వార్తా కథనాలు వినిపించాయి. అయితే, అంతకు ముందే అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ పార్టీ ఏకంగా రూ.154.28 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల ప్రచారం, ఇతర అవసరాల కోసం చేసిన ఖర్చుపై ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడించింది.

ఒక్క టీఎంసి మాత్రమే కాదు చాలా రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోసం పెట్టిన ఖర్చులను వెల్లడించాయి. తమిళనాడులో అధికార కూటమిని ఓడించి పాలనా పగ్గాలను చేపట్టిన ద్రవిడ మున్నెట్ర కళగం(DMK) కూడా ఎన్నికల ఖర్చును వెల్లడించింది. ఇటీవల జరిగిన తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో డీఎంకే రూ.114.14 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల్లో పార్టీల ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎన్నికల సంఘం తమ వెబ్​సైట్​లో పెట్టింది. ఇందులో చాలా పార్టీలున్నాయి.

తమిళనాడులో ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అన్నాడీఎంకే(AIDMK).. రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ప్రచారం కోసం రూ.57.33 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది జరిగిన అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ రూ.84.93 కోట్లు ఖర్చు చేయగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కోసం సీపీఐ కేవలం రూ.13.19 కోట్లు వ్యయం చేసినట్లు చూపించింది. ఈ రాష్ట్రాలలో బీజేపీ ఎంత ఖర్చు చేసిందో వివరాలు ఇంకా వెల్లడించలేదు.