Covid 19 : మద్యం తాగితే..కరోనా రాదంట, వీడియో వైరల్

కరోనా రాకుండా ఉండాలంటే గంజాయి, మద్యం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలవాటు లేని వారు..కూరలు, వంటల్లో రెండు మూతల మద్యాన్ని వేయాలని సూచించాడు. కరోనా..బీరోనా రాదని, దవఖానాకు పోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.

Covid 19 : మద్యం తాగితే..కరోనా రాదంట, వీడియో వైరల్

Drink Alcohol

Drinking Alcohol : కరోనా రాకుండా ఉండాలంటే..అది చేయండి..ఇది చేయండి అంటూ పలువురు ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. కరోనాను అడ్డుకొనేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యుత్సాహం వద్దని ప్రభుత్వాధికారులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా రాకుండా ఉండాలంటే..గో మూత్రం సేవించాలని ఒకరు, ఆవు పేడను ఒంటికి పూసుకోవాలనే ఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..కరోనా రాకుండా ఉండాలంటే..మద్యం సేవించాలని ఓ వ్యక్తి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Rupin Sharma IPS అధికారి..దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అల్కాహాల్ లో రసాయనాలు, ఇతరత్రా ఉంటాయని, ఇవి కరోనా కంటే..అత్యంత ప్రమాదకరమన్నారు. కరోనా రాకుండా ఉండాలంటే గంజాయి, మద్యం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలవాటు లేని వారు..కూరలు, వంటల్లో రెండు మూతల మద్యాన్ని వేయాలని సూచించాడు. కరోనా..బీరోనా రాదని, దవఖానాకు పోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు. ఎవరికైతే..గంజా అలవాటు లేని వారు మద్యం తీసుకోవాలని, కరోనా నుంచి భయపడాల్సిన అవసరం లేదని చివరిలో చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Read More : Raped and Harassed : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం… కాలువలోకి దూకి ఆత్మహత్య