Delhi: ఆర్మీ డ్రెస్‌లో నకిలీ వ్యక్తి.. విదేశీయులతో సంబంధాలు

ఆర్మీ ఆఫీసర్‌గా చెప్పుకుంటూ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్చనా రెడ్ లైట్ గ్రేటర్ కైలాశ్-1 ప్రాంతం దగ్గర అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ లో ఉండే దిలీప్ కుమార్...

Delhi: ఆర్మీ డ్రెస్‌లో నకిలీ వ్యక్తి.. విదేశీయులతో సంబంధాలు

Army Officer Fake

Delhi: ఆర్మీ ఆఫీసర్‌గా చెప్పుకుంటూ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్చనా రెడ్ లైట్ గ్రేటర్ కైలాశ్-1 ప్రాంతం దగ్గర అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ లో ఉండే దిలీప్ కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా చెప్పుకుంటూ తాను సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడకు వచ్చామని చెప్పాడు.

అతని వద్ద నుంచి ఆర్మీ ఫేక్ ఐడీ కార్డు.. మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అతనికి పలు అంతర్జాతీయ వాట్సప్ నెంబర్లతో కాంటాక్ట్ ఉన్నట్లు తెలిసింది. ‘మొబైల్ ఫోన్ పరిశీలించిన తర్వాత పలు అంతర్జాతీయ నెంబర్లతో వీడియో కాల్స్ మాట్లాడినట్లు తెలిసింది’ అని పోలీసులు చెప్పారు.

విచారణలో తాను ఇండియన్ ఆర్మీలో పనిచేసే కెప్టెన్ శేఖర్ గా నమ్మించి.. సోషల్ మీడియాలో మహిళల అటెన్షన్ కొట్టేయాలనే ఇలా చేశానని చెప్పాడు. అంతేకాకుండా కొందరు విదేశీయులతో కూడా మాట్లాడినట్లు వివరించాడు. సెక్షన్ 170/419/420/468/471ల ప్రకారం.. అతనిపై కేసు నమోదైంది.