Selfie With Daughter: మారుమూల ప్రాంత వ్యక్తి.. “కూతురితో సెల్ఫీ”ని ప్రారంభించడానికి వెనుక కారణం ఏంటీ? ఎవరాయన?  

Selfie With Daughter: "కూతురితో సెల్ఫీ" ఎలా ప్రారంభమైంది? మోదీ అంతలా ఎందుకు ప్రశంసించారు? హరియాణాలో వచ్చిన మార్పులు ఏంటీ?

Selfie With Daughter: మారుమూల ప్రాంత వ్యక్తి.. “కూతురితో సెల్ఫీ”ని ప్రారంభించడానికి వెనుక కారణం ఏంటీ? ఎవరాయన?  

Selfie With Daughter Sunil Jaglan

Selfie With Daughter: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం 100వ ఎపిసోడ్ లో మన్‌ కీ బాత్ (PM Mann Ki Baat) కార్యక్రమంలో మాట్లాడుతూ కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) గురించి ప్రస్తావించారు. కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) ఐడియా తనపై ప్రభావం చూపిందని, కుమార్తెల ప్రాధాన్యం గురించి అవగాహన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టామని చెప్పారు.

ఎనిమిదేళ్ల క్రితం కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) కార్యక్రమాన్ని హరియాణాలోని ఓ చిన్న గ్రామం నుంచి ప్రారంభించిన సునీల్ జగ్లాన్ (Sunil Jaglan)తో ప్రధాని మోదీ లైవ్ లో మాట్లాడారు. అప్పట్లో హరియాణాలో లింగ నిష్పత్తిపై చర్చ జరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. తాను కూడా ‘బేటీ బచావో – బేటీ పఢావో’ (Beti Bachao-Beti Padhao) కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. దీంతో సునీల్ జగ్లాన్ ప్రభావం తనపై పడిందని అన్నారు.

కూతురికి ప్రాధాన్యం

కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) గురించి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డానని చెప్పారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఈ ప్రచారంలోని ప్రధాన అంశం సెల్ఫీ, టెక్నాలజీ వంటివి కాదని, ఇందులో కూతురికి ప్రాధాన్యం ఇవ్వడమే ముఖ్యమని తెలిపారు. మన జీవితంలో కూతురి ప్రాధాన్యం దీని ద్వారా తెలుస్తోందని చెప్పారు. ఎన్నో ప్రయత్నాల అనంతరం ఇప్పుడు హరియాణాలో లింగ నిష్పత్తి మెరుగుపడిందని తెలిపారు.

ఆ సమయంలో సునీల్ తో మోదీ మాట్లాడారు. నమస్కారం అని ప్రారంభించారు. మోదీ కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) గురించి మాట్లాడాక చాలా సంతోషపడ్డానని చెప్పారు. కూతురితో సెల్ఫీ గురించి ఇప్పుడు మళ్లీ చర్చిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తోందని సునీల్ ను మోదీ అడిగారు. హరియాణా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని సునీల్ చెప్పారు. ప్రతి ఆడపిల్ల ప్రతి తండ్రికీ ముఖ్యమేనని అన్నారు. తన కుమార్తెలు నందిని, యాచికలో ఒకరు ప్రస్తుతం ఏడో తరగతి, మరొకరు నాలుగో తరగతి చదువుతున్నారని తెలిపారు.

ఎవరీ సునీల్ జగ్లాన్?
సునీల్ జగ్లాన్ హరియాణాలోని జింద్, బిబిపూర్ గ్రామ మాజీ సర్పంచ్. 2015 జూన్ లో కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూతుళ్లతో సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని చెప్పారు. అనంతరం ఓ వెబ్ సైట్ ప్రారంభించి, అందులోనూ వారి సెల్పీలను పోస్ట్ చేయొచ్చని అన్నారు.

తాజాగా, సునీల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) కార్యక్రమం విస్తరించడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయం సాధించిందని చెప్పారు. హరియాణాలోని జింద్ లో ఇప్పుడు లింగ నిష్పత్తి మెరుగుపడింది.

తన సొంత జిల్లాలో లింగ నిష్పత్తి మెరుగుపడిందని సునీల్ అన్నారు. ఆడపిల్లల పట్ల ప్రజలకు ఉండే ఆలోచన మారిందని చెప్పారు. అలాగే, ఎనిమిదేళ్లలో 80 దేశాల వారు సెల్ఫీలు పంపారని సునీల్ చెప్పారు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగానే ఆయన కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. 2015 జనవరిలో ప్రధాని మోదీ పానిపట్ నుంచి ప్రధాని మోదీ ‘బేటీ బచావో – బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.

ఆ కార్యక్రమం హరియాణాపై చాలా సానుకూల ప్రభావం చూపిందని తెలిపారు. 2015 జనవరిలో ప్రధాని మోదీ ‘బేటీ బచావో – బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించాక అదే ఏడాది జూన్ లో తాను సెల్ఫీ విత్ డాటర్ ను ప్రారంభించానని తెలిపారు. ‘బేటీ బచావో – బేటీ పఢావో’ కార్యక్రమానికి తోడుగా తనవంతుగా ఏదైనా ప్రత్యామ్నాయంగా చేయాలని దీన్ని ప్రారంభించానని వివరించారు. మోదీ ‘బేటీ బచావో – బేటీ పఢావో’ వల్లే తనకు ఈ కొత్త ఐడియా వచ్చిందన్నారు.

PM Mann Ki Baat : మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్.. హాజరయ్యిన బాలీవుడ్ స్టార్స్..