PM Modi: మోదీకి దండ వేసేందుకు బారికేడ్లు దాటుకెళ్లిన యువకుడు.. భద్రతా వైఫల్యం లేదన్న అధికారులు
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హుబ్బలిలో గురువారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుబ్బలి చేరుకున్న మోదీ రోడ్ షో నిర్వహించారు.

PM Modi: కర్ణాటకలో రోడ్ షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు ప్రధానికి దండ వేసేందుకు, బారికేడ్లు దాటుకుని మరీ దూసుకొచ్చాడు. దీంతో ఈ అంశంపై అధికారులు స్పందించారు.
Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హుబ్బలిలో గురువారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుబ్బలి చేరుకున్న మోదీ రోడ్ షో నిర్వహించారు. మోదీ రోడ్ షో కోసం అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్డు పక్కన మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, ఒక యువకుడు మాత్రం బారికేడ్లు దాటుకుని వచ్చాడు. ప్రధానికి పూల దండ వేసేందుకు, చేతిలో దండతో మోదీ వాహనంవైపు దూసుకొచ్చాడు.
Jammu and Kashmir: కాశ్మీర్లో హిమపాతం.. ఒకరి మృతి.. మరొకరు గల్లంతు
వెంటనే అప్రమత్తమైన మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అతడి చేతిలోని దండను లాక్కుని, ఆ యువకుడిని పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుల చేతిలో ఉన్న దండను మోదీ తీసుకుని, తన వాహనంపై వేశారు. ఎయిర్పోర్టు నుంచి సభాస్థలికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మోదీ వైపు యువకుడు దూసుకొచ్చిన ఘటనపై పోలీసులు స్పందించారు.
ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ఏమీ లేదని అధికారులు తేల్చారు. హుబ్బలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోదీతోపాటు కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, సీఎం బసవరాజు బొమ్మై, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
— ANI (@ANI) January 12, 2023