ప్రియాంకగాంధీ కోసం సెక్యూరిటీని బ్రేక్ చేసిన కార్యకర్త.. ఆమె రియాక్షన్?

ప్రియాంకగాంధీ కోసం సెక్యూరిటీని బ్రేక్ చేసిన కార్యకర్త.. ఆమె రియాక్షన్?

కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీని కలవడానికి ఓ కార్యకర్త సెక్యూరిటీ బ్రేక్ చేసి దూసుకొచ్చాడు. బాడీ గార్డులకు కూడా అందనంత వేగంతో ఆమెను సమీపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొననారు. సీనియర్ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ పక్కనే కూర్చుని ఉండగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తలపాగాతో ఓ వ్యక్తి ఫెన్సింగ్ లో నుంచి దూరి వచ్చశాడు. 

ప్రియాంక గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా ఇలాంటి పార్టీ మీటింగ్ లోనే అభిమాని ముసుగులో వచ్చిన వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ప్రియాంక.. కూల్‌నెస్ కోల్పోకుండా అతణ్ని రిసీవ్ చేసుకున్నారు. బాడీ గార్డులు అడ్డుకుని స్టేజి మీద నుంచి దింపేయాలని చూస్తున్నా వారించి అతని చేయి పట్టుకుని కాసేపు మాట్లాడారు. పూర్తిగా చెప్పి స్టేజిపై ఉన్న కాంగ్రెస్ నేతలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ వ్యక్తి కాంగ్రెస్ కు జై కొడుతూ సంతృప్తిగా కిందకు దిగాడు. 

కొద్ది వారాల క్రితం ఢిల్లీలోని ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. సమీపంలో ఉన్న భద్రతా వ్యవస్థను దాటుకొని లోపలికి వెళ్లింది. మహిళతో పాటు మరో నలుగురు కారులో ఉన్నారు. నవంబరు 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అత్యంత భద్రత ఉండే ప్రియాంక గాంధీ ఇంట్లోకి భద్రతా వ్యవస్థ కళ్లు గప్పి ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే  వారంతా ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. సెల్ఫీ కోసమే వారు ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం.