Spitting Roti : నీచాతినీచం.. వీడు మనిషేనా? ఉమ్మి వేసి రోటీ తయారీ

గతంలో ఓ పానీపూరీ బండి వ్యక్తి పానీపూరీ నీళ్లలో మూత్రం పోయడం కళ్లారా చూసి అంతా షాక్ తిన్నాం. ఇది మరువక ముందే అలాంటి దారుణం మరొకటి చోటు చేసుకుంది. ఓ దాబాలో తందూరీ రోటీ చేసే ఓ వ్యక్తి

Spitting Roti : నీచాతినీచం.. వీడు మనిషేనా? ఉమ్మి వేసి రోటీ తయారీ

Spitting Roti

Spitting Roti : మీకు ఔట్ సైడ్ ఫుడ్ అంటే బాగా ఇష్టమా? వారంలో ఒకసారైనా ఔట్ సైడ్ ఫుడ్ తెచ్చుకోవడమో లేక బయటికి వెళ్లి ఫుడ్ ని లొట్టలేసుకుంటూ తింటారా? అయితే, జాగ్రత్త. ఇక ముందు బయట ఆహారం తినేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే, బయట ఘోరాలు జరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు నికృష్టపు పనులు చేస్తున్నారు. నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారు.

గతంలో ఓ పానీపూరీ బండి వ్యక్తి పానీపూరీ నీళ్లలో మూత్రం పోయడం కళ్లారా చూసి అంతా షాక్ తిన్నాం. ఇది మరువక ముందే అలాంటి దారుణం మరొకటి చోటు చేసుకుంది. ఓ దాబాలో తందూరీ రోటీ చేసే ఓ వ్యక్తి రోటీ చేస్తూ ఏం చేశాడో చూస్తే ఛీ.. యాక్ అనకుండా ఉండలేరు. తందూరి రోటీలు చేస్తున్న ఆ వ్యక్తి వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత వాటిని కాలుస్తున్నాడు.

Rose Tea : బరువును తగ్గించే రోజ్ టీ

ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న దాబాలో ఓ వ్యక్తి తందూరి రోటీలు తయారు చేస్తున్నాడు. రోటీ తయారు చేసేటప్పుడు సాధారణంగా నూనె, నీరు వాడతారు. కానీ ఇతగాడు మాత్రం వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత వాటిని కాలుస్తాడు.

ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం దాబాకు వెళ్లిన ఓ కస్టమర్.. సదరు వ్యక్తి చేస్తున్న దారుణాన్ని చూసి షాక్ తిన్నాడు. వెంటనే దాన్ని వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అంతే, ఆ వీడియో వైరల్‌ అయ్యింది. పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు దాబా మీద కేసు నమోదు చేశారు. ఆ నీచుడిని అరెస్ట్‌ చేశారు. ఈ నీచానికి పాల్పడిన ఆ వ్యక్తిని బీహార్ లోని కిషన్ గంజ్ కు చెందిన తామిజుద్దీన్ గా గుర్తించారు. కాగా, ఈ కేసులో అతడికి బెయిల్ వచ్చింది. దీంతో అతడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.

Pani Puri : ప్రాణం మీదకు తెచ్చిన పానీపూరి.. గప్ చుప్ తిని 77మంది ఆసుపత్రి పాలు

ఇకపోతే ఫిబ్రవరి 2021 లో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో కూడా ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీలోనూ సేమ్ ఇదే ఘటన చోటు చేసుకుంది. రోటీ చేసే సమయంలో దాని మీద ఉమ్ముతున్నారు. ఆ తర్వాత వాటిని కాలుస్తున్నారు.

కాగా, ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చి.. వాళ్ల మీద ఎన్ని యాక్షన్లు తీసుకుంటున్నా.. ఇటువంటి దారుణాలు మాత్రం ఆగడం లేదు.