Barmer District News: కరోనాతో మరణించిన తండ్రి చితిలో దూకిన కూతురు

దేశంలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది.

Barmer District News: కరోనాతో మరణించిన తండ్రి చితిలో దూకిన కూతురు

Barmer District News

Barmer District News: దేశంలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఇక కరోనాతో మృతి చెందిన వారిని కడసారి చూసేందు కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాతో తండ్రి మృతి చెందాడని మనస్తాపానికి గురైన కుమార్తె తండ్రి చితిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది.

ఈ ఘటన భారత్ – పాక్ సరిహద్దుల్లో ఉన్న బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో జరిగింది. రాయ్ కాలనీలో నివాసం ఉంటున్న దామోదర్ దాస్ అనే వ్యక్తికీ కరోనా సోకింది. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దామోదర్ దాస్ మృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలోని గ్రామపంచాయితీ సిబ్బంది, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

కుమార్తె ఇతర బంధువుల సమక్షంలో చితి పేర్చి నిప్పంటించారు. ఆ వెంటనే దామోదర్ దాస్ కూతురు శారదా చితిలో దూకింది. వెంటనే తేరుకున్న సమీపంలోని వారు ఆమెను చితి నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా శారదకు 70 శాతం గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమెను బయటకు తీసే క్రమంలో మరో ఇద్దరికీ గాయాలయ్యాయి.

ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి, ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదని, అందువల్ల ఇంకా స్టేట్ మెంట్ ను నమోదు చేయలేదని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జోధ్ పూర్ ఆసుపత్రికి తరలించామని అన్నారు. మరో ఇద్దరినీ గ్రామానికి సమీపంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.