ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 10:40 AM IST
ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు

PubG.. ఇప్పుడిది సంచలనం..దీనితో పాటు విషాదం నింపుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వారిలో కొంతమంది బానిసలవుతున్నారు. రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతోంది. గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిని ఆడుతూ బయటి పరిసర ప్రాంతాలు, వ్యక్తులను కూడా మరిచిపోతున్నారంటే Pubg Game ఎంతటి ప్రభావం చూపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గేమ్ ఆడుతూ నీళ్లు అనుకుని యాసిడ్ తాగాడు. అయితే ఇతను సేఫ్‌గానే ఉన్నాడు. 
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

మధ్యప్రదేశ్‌లోని కింద్వారాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల వ్యక్తి Pubg Game ఆడుతున్నాడు. ఇతనికి పెళ్లి అయ్యింది. కూతురు కూడా ఉంది. లాన్‌లో గేమ్ ఆడుతూ లీనమై అయిపోయాడు. పక్క టేబుల్‌పై ఓ బాటిల్ ఉంది. దాహం కావడంతో బాటిల్ తీసుకుని తాగేశాడు. గొంతులోకి వెళ్లిన తరువాత అసలు విషయం అతనికి తెలిసింది. నీళ్లు కాదు..యాసిడ్ అని. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రాణాపాయం నుండి బయటపడినా అతను మాత్రం హాస్పిటల్ బెడ్‌పై మరోసారి Pubg Game ఆడుతుండడం గేమ్‌కు ఎంత బానిసయ్యాడో అర్థం చేసుకోవచ్చు. చికిత్స పూర్తి కాకముందే కుటుంబసభ్యులు అతడిని తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తరువాత ఆరోగ్య పరిస్థితిలో ఛేంజ్ కాలేదు. ఏది తిన్నా..వాంతికి చేసుకొనే వాడు. తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఒక్క వారం రోజుల్లోనే 5-6 కిలోల వెయిట్ తగ్గిపోయాడంట. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తికి ప్రాణాపాయం లేదు అని తెలుస్తోంది. సో..Pubg Game పట్ల జాగ్రత్తగా ఉండండి. 
Also Read : ఫస్ట్ టైం : రూ.20 కాయిన్ వచ్చేస్తోంది