Indore : తల్లిని పెళ్లిచేసుకుని కూతురిని లేపుకెళ్లాడు.

గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్‌ తో ఓ మహిళ ప్రేమలో పడింది.

10TV Telugu News

Indore : గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్‌ తో ఓ మహిళ ప్రేమలో పడింది.

వీరిద్దరికి వేరు వేరు వ్యక్తులతో గతంలోనే పెళ్లి జరిగింది. వారి నుంచి విడిపోయి 15 రోజుల క్రితం వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఆమె కూతురిపై కన్నేశాడు సంతోష్. యువతితో పెళ్లి చేయాలనీ రెండో భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం కారులో వచ్చి రెండో భార్య కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు.

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్, ఆ యువతి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

10TV Telugu News