కొరియర్ పార్శిల్ లో కోబ్రా

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2019 / 07:47 AM IST
కొరియర్ పార్శిల్ లో కోబ్రా

ఓ వ్యక్తికి వచ్చిన కొరియర్ పార్శిలో కోబ్రా పాము కన్పించడంతో అందరూ షాక్ అయ్యారు. శనివారం(ఆగస్టు-24,2019) ఒడిషా రాష్ట్రంలోని మయుర్బంజ్ జిల్లాలోని రాయ్ రంగపూర్ లో ఈ ఘటన జరిగింది. తనకు వచ్చిన కొరియరన్ పార్శిల్ ను ఇంట్లోకి తీసుకెళ్లి ఓపెన్ చేసిన ఆ వ్యక్తి లోపల కోబ్రా ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారమిచ్చాడు. సమాచారం అందుకుని వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు కోబ్రాను తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు.