Pregnant Girlfriend: ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్‌ను ట్రైన్‌లో నుంచి తోసిన వ్యక్తికి 10ఏళ్ల జైలు శిక్ష

గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి 10ఏళ్ల జైలు శిక్ష ఖరారు అయింది. అల్పేశ్ ఠాకూర్ అనే వ్యక్తి చేసిన నేరానికి గానూ జైలు శిక్షతో పాటు రూ.25వేల ఫైన్ విధించారు....

Pregnant Girlfriend: ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్‌ను ట్రైన్‌లో నుంచి తోసిన వ్యక్తికి 10ఏళ్ల జైలు శిక్ష

Running Train

Pregnant Girlfriend: గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి 10ఏళ్ల జైలు శిక్ష ఖరారు అయింది. అల్పేశ్ ఠాకూర్ అనే వ్యక్తి చేసిన నేరానికి గానూ జైలు శిక్షతో పాటు రూ.25వేల ఫైన్ విధించారు.

2017లో ఆనంది జిల్లాలోని అదాస్ రైల్వే స్టేషన్ నుంచి మియాగం-కర్జాన్ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు బయల్దేరారు. ఠాకూర్ తన గర్ల్ ఫ్రెండ్ సుమిత్ర చావద ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. స్టేషన్ దాటిన తర్వాత చావదాకు.. ఠాకూర్ మధ్య వాదన మొదలైంది. మాటల మధ్యలోనే కదులుతున్న ట్రైన్ లో నుంచి ప్రియురాలిని కిందకు తోసేశాడు.

ఎన్జీఓలు ఆమెను చూసి హాస్పిటల్ కు తరలించారు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. కాస్త కోలుకున్న తర్వాత ఠాకూర్ పై హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేయడంతో అరెస్ట్ చేశారు.

…………………………………………… : ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను TMC రీప్లేస్ చేస్తుందా..?

‘కోర్టుకు వినిపించిన వాదనలో యువతిని చంపేసి ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియకుండా చేయాలని ప్రయత్నించినట్లు రుజువైంది. హత్యాయత్నం కింద గరిష్టంగా పదేళ్ల పాటు జైలు శిక్ష ఖరారైంద’ని పబ్లిక్ ప్రోసిక్యూటర్ స్మృతి త్రివేది వెల్లడించారు. అంతేకాకుండా రూ.25వేలు అతని నుంచి జరిమానాగా చెల్లించాలని అందులో నుంచి రూ.15వేలు చావదాకు నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.