స్నేహితులతో గడపాలని భార్యను ఒత్తిడి చేసిన భర్త, అలా చేస్తే వారి భార్యలతో తాను ఎంజాయ్ చేస్తాడట

  • Published By: naveen ,Published On : August 4, 2020 / 09:22 AM IST
స్నేహితులతో గడపాలని భార్యను ఒత్తిడి చేసిన భర్త, అలా చేస్తే వారి భార్యలతో తాను ఎంజాయ్ చేస్తాడట

జీవితాంతం తోడునీడుగా ఉంటానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఏ కష్టం రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ పెళ్లయ్యాక తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఏ భర్త తన భార్యతో వ్యవహరించని రీతిలో ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశాడు.



స్నేహితులతో గడపాలని, సరసాలు ఆడాలని ఒత్తిడి:
తన స్నేహితులతో గడపాలని, సరసాలు ఆడాలని ఓ నీచుడు తన భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇలా చేస్తే వారి భార్యలతో తను కూడా సరదాగా గడిపే అవకాశం దొరుకుతుందని ఆమెకు చెప్పాడు. ఈ నీచమైన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. భర్త నీచపు ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు(43) పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్త బండారం బట్టబయలైంది.

అదనపు కట్నం కోసం వేధింపులు:
బాధితురాలు వెస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని వాపోయింది. అంతటితో ఆగకుండా తన మగ స్నేహితులతో సరసాలాడాలని భర్త ఒత్తిడి చేస్తున్నాడని చెప్పి కంటతడి పెట్టింది. అలా చేస్తే ఆ మిత్రుల భార్యలతో సరదాగా గడపడానికి ఆ స్నేహితులు ఒప్పుకున్నారని, అందుకే భర్త తనపై ఒత్తిడి తెచ్చాడని వెల్లడించింది. ఈ బాధ భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పి, తన నగలు ఇచ్చేయమంటే భర్త కుటుంబం నిరాకరిస్తోందని వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



కట్నంగా 50 తులాల బంగారం:
2002లో ఆ ఇద్దరికి వివాహం జరిగింది. కట్నం కింద 50 తులాల గోల్డ్ ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు అమ్మాయి తల్లిదండ్రులు. అబ్బాయి ఎంబీఏ చదివాడని, సొంత టెక్ట్స్ మిల్స్ ఉన్నాయని చెప్పారు. పెళ్లయిన 6 నెలల తర్వాత భర్త నిజస్వరూపం బయటపడింది. వరకట్న వేధింపులు ప్రారంభించాడు. అదనపు వరకట్నం కావాలని, కారు కావాలని భార్యని డిమాండ్ చేశాడు భర్త. అయితే తన తల్లిదండ్రులను అదనపు కట్నం అడగటానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ భర్త కోపంతో ఆమెను కొట్టాడు. 2005లో ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు. అదే సమయంలో భర్త గురించి ఆమెకు ఓ నిజం తెలిసింది. అసలు అతడు ఎంబీఏ చదవలేదనే విషయం బటయపడింది. దీంతో కుటుంబపోషణ కోసం ఆమె ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించింది.

ఎంబీఏ అబద్దం.. తాగుడు, జూదానికి బానిసయ్యాడు:
కాగా, భర్త మరింత దిగజారిపోయాడు. చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. తాగుడు, జూదానికి బానిస అయ్యాడు. అదే సమయంలో తన స్నేహితులతో గడపాలని భార్యను ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశాడు. ఈ బాధలు భరించలేకపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. తాను ఆ నీచుడితో ఇక సంసారం చేయలేను అని చెప్పింది. తన బంగారం తనకు ఇచ్చేయాలని అడిగితే అత్తింటి వారు తనను ఇంట్లో నుంచి గెంటేశారని వాపోయింది. భర్త, అత్తమామలపై ఆమె కేసు పెట్టింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను వేడుకుంది.