Fake RTPCR : రూ.500 ఇస్తే.. అరగంటలో ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్.. పోలీసుల అదుపులో నిందితుడు

500లకు పైగా ఫేక్ కరోనా నెగటివ్ సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో స్మగ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు

Fake RTPCR : రూ.500 ఇస్తే.. అరగంటలో ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్.. పోలీసుల అదుపులో నిందితుడు

Fake Rtpcr

Fake RTPCR : కరోనా నేపథ్యంలో భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరైంది. ఈ టెస్టులో కరోనా నెగటివ్ వస్తేనే అనుమతిస్తారు. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు రావాలంటే 24 గంటల సమయం పడుతుంది. శాంపిల్స్ అధికంగా ఉంటే ఈ సమయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి ఫేక్ ఆర్టీపీసీఆర్ దుకాణం తెరిచాడు. అత్యవసరం ఉన్నవారికి రూ.500 తీసుకోని ఆర్టీపీసీఆర్ కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఇచ్చేవాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 500లకుపైగా ఫేక్ సర్టిఫికెట్లు జారీచేశారు. ఈ సర్టిఫికెట్స్ తీసుకోని చాలామంది విదేశాలకు వెళ్లారు. కాగా ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఇన్బర్ ఖాన్ అనే వ్యక్తి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడ్డాడు.

చదవండి : Corona Vaccine : భారత్ మరో రికార్డు.. 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా ఇన్బర్ ఖాన్ అనే వ్యక్తి చెన్నై నగరంలోకి ఓ టెస్టింగ్ ల్యాబ్ పేరుతో ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. రూ.500లకే కరోనా ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ ఇస్తానని ప్రకటన విడుదల చేశాడు. అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దాంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రొమోషన్ చేశాడు. తన ఖాతాలో రూ.500 వేస్తె 30 నిమిషాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు ఇస్తానని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ల్యాబ్ పేరు కూడా ఆ ప్రకటనలో పొందుపరిచాడు. ఈ ప్రకటన ల్యాబ్ యజమాని హరీజ్ పర్వేజ్ కంటపడింది.

చదవండి : Corona cases: బీ కేర్ ఫుల్.. కరోనా కేసులు పెరిగాయి..!

తన ల్యాబ్ పేరుతో ఎవరో మోసాలకు పాల్పడుతున్నారని.. ఎలాగైనా తెలుసుకోవాలని అనుకున్నాడు. ప్రకటన వచ్చిన నెంబర్ కి కాల్ చేసి వివరాలు కనుక్కున్నాడు. తనకు కరోనా నెగటివ్ సర్టిఫికెట్ కావాలని ఇన్బర్ ఖాన్ కి ఫోన్ చేసి, అనంతరం అతడికి రూ.500 గూగుల్ పే చేశాడు. డబ్బు పంపిన 30 నిమిషాల్లోనే కరోనా నెగటివ్ సర్టిఫికెట్ వచ్చింది. అయితే ఆ సర్టిఫికెట్ తన ల్యాబ్ పేరుమీదనే రావడంతో అప్రమత్తమైన హరీజ్ పర్వేజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చదవండి : AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, భారీగా తగ్గిన మరణాలు

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా ఇన్బర్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. అతడికి స్మగ్లర్లతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొరియన్ స్మగ్లర్లకు ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేల్చారు. ఇక విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించింది.