Delhi-Kanpur train: రైలులో ఇనుపరాడ్డు రూపంలో దూసుకొచ్చి యువకుడిని కబళించిన మృత్యువు

మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఓ యువకుడు రైలులో కిటికీ దగ్గర కూర్చొని ప్రయాణిస్తున్నాడు. కిటికీ అద్దాలను పగులకొట్టుకుని మరీ ఓ రాడ్డు రూపంలో మృత్యువు వచ్చి అతడి ప్రాణాలు తీసింది. ఢిల్లీ-కాన్పూర్ నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అనూహ్య రీతిలో ప్రమాదం జరిగి ఆ యువకుడు మృతి చెందాడు.

Delhi-Kanpur train: రైలులో ఇనుపరాడ్డు రూపంలో దూసుకొచ్చి యువకుడిని కబళించిన మృత్యువు

Delhi-Kanpur train

Delhi-Kanpur train: మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఓ యువకుడు రైలులో కిటికీ దగ్గర కూర్చొని ప్రయాణిస్తున్నాడు. కిటికీ అద్దాలను పగులకొట్టుకుని మరీ ఓ రాడ్డు రూపంలో మృత్యువు వచ్చి అతడి ప్రాణాలు తీసింది. ఢిల్లీ-కాన్పూర్ నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అనూహ్య రీతిలో ప్రమాదం జరిగి ఆ యువకుడు మృతి చెందాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… రైలులో జనరల్ కోచ్ లో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణిస్తున్నాడు ఓ యువకుడు. ఇవాళ ఉదయం 8.45 గంటలకు ఢిల్లీ-కాన్పూర్ నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దన్వార్-సోమ్నా మధ్యలో ప్రయాణిస్తోంది. అదే సమయంలో బయటి నుంచి ఓ ఇనుమ రాడ్డు బలంగా దూసుకొచ్చి కిటికీ అద్దాన్ని పగులకొట్టి ఆ యువకుడి మెడలోకి దూసుకుపోయింది.

Ukraine war: యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌తో చర్చలు జరిపేందుకు నేను సిద్ధం: బైడెన్

మెడ ముందు భాగం నుంచి దిగి వెనుక భాగం నుంచి ఆ రాడ్డు బయటకు వచ్చింది. దీంతో కూర్చున్న సీటులోనే ప్రాణాలు విడిచాడు ఆ యువకుడు. దీంతో ఉదయం 9.23 గంటలకు అలీగఢ్ జంక్షన్ వద్ద రైలును ఆపి, అతడి మృతదేహాన్ని అధికారులు పరిశీలించారు.

అతడి పేరు హృశికేశ్ దుబే (34) అని అతడి స్వస్థలం సుల్తాన్ పూర్ అని, ఉపాధి నిమిత్తం ఢిల్లీలో నివసించేవాడని గుర్తించారు. రైల్వే ట్రాకులపై పనులు జరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా ఆ రాడ్డు కిటికీ నుంచి దూసుకొచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..