Man attack Lady lawyer: ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదు: మహిళా న్యాయవాదిని కాలితో తన్నిన కర్కశడు
మహిళా న్యాయవాదిని ఒక వ్యక్తి పదే పదే కాలితో తన్నిన ఘటన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లో చోటుచేసుకుంది.

Man attack Lady lawyer: మహిళపై దాడులకు పాల్పడుతున్న కొందరు దుర్మార్గులు తామూ ఒక మహిళకే పుట్టామన్న సంగతి మరచి, మానవత్వానికే మచ్చ తెస్తున్నారు. సాటి మహిళలో తల్లిని, సోదరిని చూడాల్సిన కొందరు వ్యక్తులు, కర్కశత్వంతో వ్యవహరిస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళా న్యాయవాదిని ఒక వ్యక్తి పదే పదే కాలితో తన్నిన ఘటన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లో చోటుచేసుకుంది. స్థానిక మీడియా కధనం మేరకు..బాగల్కోట్కు చెందిన మహంతేశ్ చొల్చగుడ్డ అనే వ్యక్తికి అదే పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది, సంగీతా సిక్కేరికి మధ్య స్వల్ప వాదన చోటుచేసుకుంది. ఈక్రమంలో సంగీతా పై మహంతేశ్ దాడికి పాల్పడ్డాడు.
Other Stories:Katra Bus Fire: కత్రా బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనే: జాతీయ దర్యాప్తు సంస్థ
పట్టపగలు, అందరూ చూస్తుండగానే మహంతేశ్ మహిళా న్యాయవాది సంగీతాను కాలితో పదే పదే పొట్టపై తన్నాడు. మహంతేశ్ విచక్షణ రహితంగా దాడి చేస్తుండగా..పక్కనే ఉన్న సంగీతా భర్త అడ్డుకోబోయాడు. దీంతో మహంతేశ్ అతనిపైనా దాడి చేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న సంగీతా భర్త.. ఎవరైనా కాపాడండి అంటూ స్థానికులను వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. మహంతేశ్ మహిళా న్యాయవాదిపై దాడి చేస్తున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంగీతా సిక్కేరి, ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ಇದು ಉತ್ತರ ಭಾರತದ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ನಡೆದ ಘಟನೆಯಲ್ಲ, ಇದು ನಮ್ಮ ರಾಜ್ಯದ ಬಾಗಲಕೋಟೆಯಲ್ಲಿ ಹಾಡು ಹಗಲೆ ಒಬ್ಬ ಮಹಿಳಾ ವಕೀಲೆ ಮೇಲೆ ನೆಡೆದ ಅಮಾನವೀಯ ಹಲ್ಲೆ.
ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ @BSBommai ಮತ್ತು ಗೃಹ ಮಂತ್ರಿಗಳಾದ @JnanendraAraga ಅವರೇ ಇದೇನಾ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ ಮಾದರಿಯಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಮಾಡಲು ಹೊರಟ ಯುಪಿ ಗೂಂಡಾ ರಾಜ್ಯ .#bagalkote pic.twitter.com/KFLHtLwzEY
— ನನ್ನ ಕರ್ನಾಟಕ / Nanna Karnataka (@Nanna_Karnataka) May 14, 2022
ఘటనపై శనివారం ఆలస్యంగా స్పందించిన బాగల్కోట్ పోలీసులు, వీడియో ఆధారంగా మహంతేశ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్థానిక రాజకీయ నేత అండతోనే మహంతేశ్ తమపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదని ఒకరు కామెంట్ చేస్తే, పోలీసులు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేశారు.
1Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు
2JOB NOTIFICATION : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
3Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
4Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..
5BSF JOBS : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్ బి పోస్టుల భర్తీ
6Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
7Viral Video: వామ్మో.. ఇదేందయ్యో.. రెండు రుచులను ఒకేసారి చూడగలదు..!
8RRCAT JOBS : ఆర్ఆర్ సీఏటీలో పోస్టుల భర్తీ
9VZM MLA VS MLC : విజయనగరం జిల్లా YCPలో ఆధిపత్య పోరు..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ వార్
10Nalgonda : కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!