వదలట్లేదు…రాహుల్ కి ముద్దు పెట్టిన యువకుడు

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2019 / 08:28 AM IST
వదలట్లేదు…రాహుల్ కి ముద్దు పెట్టిన యువకుడు

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఓ యువకుడు ముద్దు పెట్టాడు. తాను ప్రతినిధ్యం వహిస్తున్న కేరళ లోని వయనాడ్ లో ఇవాళ(ఆగస్టు-28,2019)రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా వయనాడ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు వయనాడ్ లో పర్యటించిన రాహుల్ ఇవాళ మరోసారి వయనాడ్ పర్యటన చేపట్టారు.

 వయనాడ్ లోక్ సభ పరిధిలోని బవళి గ్రామంలో వరద బాధితులను కులుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అన్ని రకాలుగా అండగా ఉంటానని వారికి రాహుల్ హామీ ఇచ్చారు. గ్రామస్థులతో సమావేశం అనంతరం రాహుల్ తిరుగుపయనమయ్యేందుకు కారు ఎక్కారు. కారులో కూర్చున్న రాహుల్ కి సడన్ గా వచ్చి ఓ యువకుడు ముద్దు పెట్టాడు. సెక్యూరిటీ సిబ్బంది పక్కకు లాగుతున్నా కూడా రాహుల్ కి ముద్దు పెడుతూనే ఉన్నాడు. చివరికి సెక్యూరిటీ సిబ్బంది అతడిని పక్కకి పంపించేశారు.