Tip Refund: బిల్డప్ కోసం టిప్ ఇచ్చాడు.. గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు అడిగి తీసేసుకున్నాడు

టింగ్ లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి సూపర్ హీరో అనే రేంజ్ లో చూపించాలనుకుంటారు. కొందరైతే ఎక్కడ లేని మంచితనం, ఉదార గుణం తమకే ఉందన్నట్లు బిహేవ్ చేస్తారు. ఇన్నర్ ఫీలింగ్ పక్కకుబెడితే పైకి చూసే వాళ్లు దాదాపు నిజమే...

Tip Refund: బిల్డప్ కోసం టిప్ ఇచ్చాడు.. గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు అడిగి తీసేసుకున్నాడు

Tip Refund

Tip Refund: డేటింగ్ లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి సూపర్ హీరో అనే రేంజ్ లో చూపించాలనుకుంటారు. కొందరైతే ఎక్కడ లేని మంచితనం, ఉదార గుణం తమకే ఉందన్నట్లు బిహేవ్ చేస్తారు. ఇన్నర్ ఫీలింగ్ పక్కకుబెడితే పైకి చూసే వాళ్లు దాదాపు నిజమే అనుకోవాల్సిందే.

ఇక్కడా అదే జరిగింది.. గర్ల్ ఫ్రెండ్ తో కలిసి డేటింగ్ కు వచ్చిన వ్యక్తి ఓవరాక్షన్ చేసి టిప్ 100డాలర్లు ఇచ్చి తర్వాత 20 ఉంచుకుని మిగిలిన 80డాలర్లు ఇచ్చేయాలని వాదించాడు. ఈ ఘటన మొత్తాన్ని టిప్ అందుకున్న వెయిట్రెస్ సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.

ఆ మనిషి చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడిలా అనిపించాడు. నన్ను అభినందించాడు. వాటర్ ఇవ్వడానికి వెళ్లినా, ఏమైనా కావాలని అడిగినా ప్రతిసారీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. కిచెన్ లో పొరబాటు జరిగిన వంటకు కూడా సూపర్ ఎక్స్ ట్రా నైస్ అంటూ పొగిడేశాడు. నిజంగా కస్టమర్లంతా ఇలా ఉంటే బాగుండు అనుకున్నా’

అతనేదో సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నాడు కావొచ్చు. ఖర్చుకు వెనకాడటం లేదని అనుకున్నా. అన్నీ క్వాలిటీతో కూడినవే అడిగాడు కానీ, రేట్ గురించి మాట్లాడలేదు.

సాయంత్రం నుంచి మొదలైన వాళ్ల హంగామా కాసేపటికి ముగిసింది. సరదాగా వాళ్లను అడిగా ‘మీరు కలిసే ఉంటారా… విడిగానా’ అని. ఆమె ‘సపరేట్’ అని చెబితే.. ‘జోక్ చేస్తున్నావా మేం కలిసే ఉంటా’మని రెస్పాన్స్ ఇచ్చాడు. నువ్వు నాతో ఉన్నంత సేపు నేనే పే చేస్తా అని క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశాడు.

బిల్ మొత్తం 289డాలర్లు (రూ.20వేల 979) అయింది. దానికి టిప్ గా 100డాలర్లు (రూ.7259) ఇచ్చాడు. అంతేకాకుండా సర్వీసుకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ రోజు నాకు అదృష్టంగా భావించా. టిప్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబితే వెయిటర్లను ఎప్పుడూ అభినందించాల్సిందే’ అని అన్నాడు.

వాళ్లిద్దరూ వెళ్లిపోయిన కాసేపటికే అతనొక్కడే తిరిగొచ్చాడు. లోపల ఏదో మర్చిపోయానని చెప్పి తలుపు తెరుచుకుని వచ్చాడు. తాను ఇచ్చిన టిప్ లో 20 డాలర్లు మాత్రమే ఉంచుకుని మిగిలినది తిరిగిచ్చేయాలని, ఆ డబ్బులు తన గర్ల్ ఫ్రెండ్ ముందు బిల్డప్ కోసమే ఇచ్చానని చెప్పాడు.

నాకెంత కోపం వచ్చినా బయట పడలేదు. సరే సార్.. మీ 20డాలర్ల టిప్ ఉంచుకుని మిగతాది ఇచ్చేయమంటున్నారు అంతేకదా అని చెప్పా. ఏదో ఒకలా బుద్ధి చెప్పాలనిపించింది. అతను డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటే వెనకే వెళ్లాను.

గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లగానే ఆమెకు వినపడలాగా సార్.. మీరు వంద డాలర్లు ఇచ్చిన టిప్ కు సంతకం చేశారు. రెండో సారి వచ్చి టిప్ ను 20డాలర్లకు తగ్గించాక ఇచ్చిన బిల్ పై సంతకం పెట్టలేదు. ఈ టిప్ అనేది పై వాళ్లకు చూపించాల్సి ఉంటుంది. ప్రతీది డాక్యుమెంట్ లో ఇవ్వాలి. దీని మీద కూడా సంతకం చేయండని అడిగా. అంతే అతను షాక్ అయి నోరు తెరిచాడు’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

ఆ తర్వాత వెయిట్రెస్ చెప్పిన నిజాన్ని కన్విన్స్ చేయడం కోసం.. ఏం చెప్తుందో అర్థం కావడం లేదంటూ బుకాయించడం మొదలుపెట్టాడట. వెయిట్రెస్ చెప్పిన మాటపై నమ్మకం ఉంచిన గర్ల్ ఫ్రెండ్ చూస్తుండగానే వదిలేసి వెళ్లిపోయిందట.