Cyber Crime: రూ.1.29 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

యువతిని ఎరగా వేసి ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. వారి వలలో చిక్కి రూ.1.29 కోట్లు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని రాజ్‌కోట్‌ జిల్లా గోండల్‌ పట్టణానికి చెందిన అశ్విన్‌ విసారియా అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడు సంపన్న రైతు.

Cyber Crime: రూ.1.29 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Crime

Cyber Crime: యువతిని ఎరగా వేసి ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. వారి వలలో చిక్కి రూ.1.29 కోట్లు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని రాజ్‌కోట్‌ జిల్లా గోండల్‌ పట్టణానికి చెందిన అశ్విన్‌ విసారియా అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడు సంపన్న రైతు. వ్యవసాయంతోపాటు ఎర్త్‌ మూవింగ్‌ మిషన్లను కిరాయికి తిప్పుతుంటాడు. ఇతడి ఫోన్ కు గతేడాది ఫిబ్రవరి నెలలో ఓ సందేశం వచ్చింది. ‘‘ మీరు అందమైన హై ప్రోఫైల్‌ మహిళలతో గడపాలి అనుకుంటే తమను సంప్రదించండి..’’ అంటూ సందేశం పంపారు సైబర్ నేరగాళ్లు.

అది చదివిన అశ్విన్‌ ఆసక్తిగా ఉన్నట్లు రిప్లై ఇచ్చాడు. దీంతో అవతలి నుంచి ఓ నిందితుడు అశ్విన్ కు ఫోన్ చేసి డేటింగ్ యాప్ లో రిజిస్టర్ కావాలి.. అందుకు రూ.2,500 చెల్లించాలని కోరాడు. అశ్విన్ వెనకముందు ఆలోచించకుండా అతడికి డబ్బు పంపాడు. కొద్దీ రోజులకు మరో ఆఫర్ ఇచ్చారు. విఐపీ మెంబర్ షిప్ తీసుకుంటే మంచి అందగత్తెలతో గడపొచ్చని తెలిపారు. అయితే అతృతతో వారు అడిగినంత వేశాడు.

తాను డబ్బులు వేస్తున్నా తన దగ్గరకు ఏ యువతి రావడం లేదని సైబర్ నేరగాళ్లకు ఫోన్ చేసి అడిగాడు. అయితే వారు మాయమాటలు చెప్పి తప్పించుకున్నారు. ఆలా కొద్దీ నెలల తర్వాత సైబర్ నేరగాళ్లు మళ్లీ కాల్ చేసి ఈ సారి వేరే వ్యాపారం గురించి చెప్పారు. వ్యాపారంలో లాభాలు బాగా ఉంటాయని వివరించారు. దీంతో అత్యాశకు పోయిన అశ్విన్ ఏకంగా రూ.1.29 కోట్లు సమర్పించుకున్నాడు.

అంత డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి ఇచ్చిన తర్వాత కానీ తెలియలేదు తాను మోసపోయానని. డబ్బు తీసుకున్న నేరగాళ్లు ఫోన్ తీయడం మానేశారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న అశ్విన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.